అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. భారత్‌కు టీకాలను సరఫరా చేస్తామని కమల హామీ ఇచ్చారు.
ఉపాధ్యక్షురాలితో మాట్లాడిన తర్వాత ట్వీట్ చేసిన ప్రధాని మోదీ.. కమలా హారిస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
"ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో కొద్దిసేపటి క్రితం మాట్లాడాను. భారత్‌కు టీకాలు అందించేందుకు ఇచ్చిన హామీ ప్రశంసనీయం. అమెరికా ప్రభుత్వం, అక్కడి వ్యాపార వర్గం, భారత సంతతి నుంచి అందిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాను. అమెరికా-భారత్ టీకా సహకారాన్ని బలోపేతం చేసేందుకు ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలపై చర్చించాం. కరోనా అనంతరం ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక రికవరీ వంటి రంగాల్లో భాగస్వామ్యంపై సమాలోచనలు జరిపాం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
టీకా ఉత్పత్తి సహా అమెరికా- భారత్ హెల్త్ సప్లై చైన్ రంగాల బలోపేతంపై ఇరువురు నేతలు చర్చించారని అధికారులు తెలిపారు. కరోనా దీర్ఘకాలిక ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతిపాదించిన 'క్వాడ్' టీకా కార్యక్రమం ప్రస్తావనకు వచ్చిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మెరుగైన తర్వాత ఉపాధ్యక్షురాలిని భారత్‌కు ఆహ్వానించాలని భావిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారని తెలిపారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభ్యర్థన మేరకే ఈ ఫోన్ కాల్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ దేశాధినేతలతోనూ..
మోదీతో పాటు.. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్, గ్వాటెమాలా అధ్యక్షుడు అలెజాండ్రో గియామ్మటై, కరీబియన్ కమ్యూనిటీ ఛైర్మన్ పీఎం కెయిత్ రోలీతోనూ కమలా హారిస్ మాట్లాడినట్లు ఉపాధ్యక్షురాలి ప్రతినిధి సైమోన్ శాండర్స్ తెలిపారు. ప్రపంచానికి అమెరికా సరఫరా చేయాలనుకున్న టీకాలలో 2.5 కోట్ల డోసులు ఈ దేశాలకు అందజేయనున్నట్లు సైమోన్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయా దేశాధినేతలకు కమల వివరించారని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా టీకా కవరేజీ సాధించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని కమల ఈ సందర్భంగా పేర్కొన్నారు. టీకాల కోసం అభ్యర్థించిన దేశాలన్నింటికీ వీలైనంతగా సహాయం చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి-ఆ విద్యార్థులకు మోదీ సర్ప్రైజ్