చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి పని చేసేందుకు మొగ్గుచూపడం లేదని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. ఈ క్రమంలో యూపీఏని తిరిగి పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కొత్త కూటమికి శరద్‌పవార్ లాంటి సీనియర్ నేత నాయకత్వం వహించాలని కోరారు. యూపీఏ భవిష్యత్తు అంతా కాంగ్రెస్ చేసే త్యాగాల మీదే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఔరంగాబాద్‌లో ఓ కార్పొరేటర్ ఏర్పాటు చేసిన 'జై భీమ్ వేడుక'లో పాల్గొన్న సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ఎన్డీఏ లేదన్న రౌత్... ఇప్పటికే చాలా పార్టీలు కూటమి నుంచి వైదొలిగినట్లు గుర్తు చేశారు. అదే క్రమంలో యూపీఏ కూడా కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు.
"యూపీఏకు భవిష్యత్తు లేదు. తిరిగి పునర్నిర్మించాలంటే శరద్ పవార్ లాంటి సీనియర్ నాయకుడు నాయకత్వం వహించాలి. అది జరిగితే, మరిన్ని పార్టీలు యూపీఏలో భాగం అవుతాయి. కాంగ్రెస్ అంగీకారం లేకుండా ఇది జరగడం కష్టం. కూటమి భవిష్యత్తు అనేది కాంగ్రెస్ చేసే త్యాగం,నాయకులు ఉదారతపై ఆధారపడి ఉంటుంది