UP crime news: అత్యాచారం జరిగిన 27ఏళ్లకు నిందితుడిని అరెస్ట్ చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ షాజహన్పుర్లో జరిగింది. 12ఏళ్ల వయసులోనే బాధితురాలు అత్యాచారానికి గురైంది. ఆమె ఇంటికి పొరుగున ఉండే నకి హసన్, మహమ్మద్ రాజి అలియాస్ గుడ్డు అనే ఇద్దరు సోదరులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె గర్భవతి అయి.. ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఘటనపై 27ఏళ్ల క్రితమే బాధితురాలు కేసు పెట్టారు. నిందితులిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు పోలీసులు. అనంతరం, వారి డీఎన్ఏ వివరాలు సేకరించారు. గుడ్డు డీఎన్ఏ.. బాధితురాలికి పుట్టిన బిడ్డ డీఎన్ఏతో సరిపోలింది. అయితే, ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సదర్ బజార్ పోలీస్ స్టేషన్ 27ఏళ్ల తర్వాత నిందితుడిని పట్టుకున్నారు. మంగళవారం అతడిని అరెస్టు చేసి.. జైలుకు తరలించారు.
12ఏళ్ల బాలికపై రేప్.. 27ఏళ్ల తర్వాత నిందితుడు అరెస్ట్.. మైనర్‌పై నలుగురు కలిసి.. - up latest news
UP rape accused arrest 27 years: అత్యాచార కేసులో నిందితుడిని 27ఏళ్ల తర్వాత అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. మరోవైపు, ఝార్ఖండ్‌లో మైనర్‌పై నలుగురు దుండగులు గ్యాంగ్‌రేప్ చేశారు. అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
Football player Gangrape Jharkhand: మరోవైపు, ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన మైనర్‌పై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. ఝార్ఖండ్‌లో ఈ ఘటన జరిగింది. నలుగురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బాలిక ఝార్ఖండ్‌లోని ఖార్సిదాగ్ ఓపీ ప్రాంతంలో నివసిస్తోంది. ఒడిశాలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు వెళ్లింది. మ్యాచ్ అనంతరం తిరిగి ఇంటికి బయల్దేరిన బాలిక సోమవారం సాయంత్రం ఝార్ఖండ్‌కు వచ్చింది. బాల్సిరింగ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆమె.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో బుక్ చేసుకుంది.
ఈ క్రమంలో ముగ్గురు దుండగులు ఆటో ఎక్కారు. బాలికను వేధింపులకు గురి చేశారు. బాలిక ప్రతిఘటించేసరికి.. చంపేస్తామంటూ ఆయుధాలు చూపించి బెదిరించారు. అదే ఆటోలో బాలికను దాశ్రమ్ఫాల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెపై భౌతికంగానూ దాడి చేశారు. మంగళవారం ఉదయం బాలికను అడవి నుంచి బయటకు తీసుకొచ్చి దస్మైల్ ప్రాంతంలో వదిలేసి వెళ్లారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. రంగంలోకి దిగారు. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు జరిపించారు. అనంతరం ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు.