ఇటీవల జరిగిన బిహార్, గుజరాత్, బంగాల్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రభావం చూపించిన ఎంఐఎం.. తాజాగా ఉత్తర్ప్రదేశ్లో బరిలో దిగేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని మైనార్టీ ఓట్లే లక్ష్యంగా వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ 100కుపైగా స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ వెల్లడించారు.
యూపీలో ప్రధాన పార్టీలైన భాజపా, సమాజ్వాదీ పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచార సన్నాహాలు చేపడుతున్న నేపథ్యంలో మజ్లిస్ చేసిన ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
131 స్థానాల్లో ప్రభావం!
'రాష్ట్రంలో 131స్థానాల్లో ముస్లిం ఓటర్లు కీలకంగా మారారు. ఈ పరిస్థితుల్లో భాజపాను అడ్డుకోవాలంటే అన్ని పార్టీలు కలిసి పోరాడాలి' అని షౌకత్ అలీ అన్నారు. ఇందుకు కోసం ఏర్పడే ఏ కూటమిలోనైనా ఎంఐఎం భాగస్వామిగా ఉంటుందన్నారు. 'దుండగుల కూటమి'లో మాత్రం ఎంఐఎం చేరదని వ్యాఖ్యానించారు.
మజ్లిస్ ప్రభావం చూపిస్తుందా?
మైనార్టీ ఓటర్లు అధికంగా ఉండే ఉత్తర్ప్రదేశ్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కీలకంగా మారనుంది. కొన్ని పార్టీలకు సాంప్రదాయంగా వస్తున్న ముస్లిం ఓట్లను మజ్లిస్ చీల్చే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరిలో మజ్లిస్ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పుర్వాంచల్లో పర్యటించినప్పుడు మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ముస్లిం ఓట్లపైనే ఆధారపడ్డ సమాజ్వాదీ పార్టీ సందిగ్ధంలో పడింది.
ఆ పార్టీతో కలిస్తే?