తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అత్యాచారం కేసు నమోదుకు నిరాకరణ- సీఎంకు ట్వీట్​ - ఉత్తర్​ప్రదేశ్

తన సోదరిపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళితే కేసు నమోదు చేసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. దాంతో ఆ వ్యక్తి.. ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగీ ఆదిత్యనాథ్​కు ఫిర్యాదు చేశాడు. దాంతో నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు.

up-police-take-rape-complaint-after-tweet-to-cm
సీఎం ఆదేశాలతో అత్యాచార నిందితులపై కేసు నమోదు

By

Published : Mar 4, 2021, 7:43 PM IST

అత్యాచారం చేసిన నిందితులపై కేసు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారని బాధిత కుటుంబం ముఖ్యమంత్రికి ట్విట్టర్​ ద్వారా ఫిర్యాదు చేసింది. దాంతో వెంటనే నిందుతులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

ఇదీ జరిగింది?

అమరోహా జిల్లాకు చెందిన ఓ బాలిక పొలం పనుల కోసం మార్చి1న ఇంటి నుంచి బయటికి వెళ్లింది. మాటేసిన ఇద్దరు వ్యక్తులు ఆమెను చెరుకు తోటలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారనికి పాల్పడ్డారు. పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించారు. మనస్థాపంతో ఆ బాలిక ఇంటికెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది.

కుల్దీప్​, రాజీవ్ అనే ఇద్దరు వ్యక్తులు తమ సోదరిపై అత్యాచారనికి పాల్పడ్డారని పోలీసులకు బాధితురాలి సోదరుడు ఫిర్యాదు చేశాడు. అయితే కేసు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారు. దాంతో సీఎం యోగి ఆదిత్యనాథ్​కు ఫిర్యాదు చేస్తూ ట్వీట్​ చేశాడు.

ఇదీ చూడండి:కూతుర్ని చంపి.. తలతో ఠాణాకు!

ABOUT THE AUTHOR

...view details