ఉత్తర్‌ప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌లో రూ.10 కోట్ల విలువ చేసే కల్తీ మద్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. భూమిలో పాతిపెట్టిన 23వేల లిక్కర్ బాటిళ్లను జేసీబీ సాయంతో బయటకు తీశారు.
పరారీలో నిందితుడు..
ఉత్తర్‌ప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌లో రూ.10 కోట్ల విలువ చేసే కల్తీ మద్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. భూమిలో పాతిపెట్టిన 23వేల లిక్కర్ బాటిళ్లను జేసీబీ సాయంతో బయటకు తీశారు.
పరారీలో నిందితుడు..
గుడ్డు సింగ్ అనే వ్యక్తి ఫాంహౌస్‌లో ఈ మద్యాన్ని వెలికితీసినట్లు పోలీసు అధికారి కేపీ సింగ్ తెలిపారు. తనిఖీ నేపథ్యంలో నిందితుడు పరారైనట్లు వెల్లడించారు. 96 కెమికల్ డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో డ్రమ్ము విలువ రూ. 2 లక్షల వరకు ఉంటుందని అన్నారు.
వీటితో పాటు ఫాంహౌస్‌లో లక్ష 23 వేల చిన్న సీసాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల కల్తీ మద్యం తాగి యూపీలో చాలా మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.