తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Yogi Adityanath: 'ఆ పార్టీ తీవ్రవాదానికి తల్లి లాంటిది' - బీఎస్‌పీ అధ్యక్షురాలు ఎవరు?

ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సీఎం యోగి ఆదిత్యనాథ్(Up Cm Yogi Adityanath) విమర్శలకు పదును పెంచారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్​ పార్టీని(Congress Party) తీవ్రవాదానికి తల్లిగా అభివర్ణించారు. సమాజ్​వాదీ పార్టీపైనా(Samajwadi Party) తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

Yogi Adityanath
Yogi Adityanath

By

Published : Sep 13, 2021, 5:53 AM IST

Updated : Sep 13, 2021, 6:48 AM IST

త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తర్​ప్రదేశ్​లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath) ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీ(Congress Party News) తీవ్రవాదానికి తల్లిలాంటిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తేలు ఎక్కడున్నా కుడుతుందని పరోక్షంగా సమాజ్​ వాదీ పార్టీని(Samajwadi Party News) ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అభివృద్ధి పథకాలను సక్రమంగా అమలు చేసి ఉంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏడు సీట్లు మాత్రమే వచ్చేవి కాదని' ఎద్దేవా చేశారు.

"దేశంలోని అన్ని రకాల తీవ్రవాదాలకు కాంగ్రెస్ తల్లిలాంటిది. రాముడి భక్తులపై తూటాలు పేల్చిన వారిని, తాలిబన్లకు మద్దతునిచ్చే వారిని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ ఆదరించరు. భాజపా మాత్రం అందరి విశ్వాసాలనూ గౌరవిస్తుంది."

-యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం

నిరుద్యోగం, మాఫియా, అవినీతి తప్ప కాంగ్రెస్, ఎస్‌పీ, బీఎస్‌పీ రాష్ట్రానికి ఏమిచ్చాయి? అని ప్రశ్నించిన యోగి.. 2022 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు కనీసం చెప్పుకోదగ్గ స్థాయిలో పోటీనివ్వలేవని' జోస్యం చెప్పారు.

అంతకముందు కుశీనగర్​ జిల్లాలో రూ.400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన ఆదిత్యనాథ్(UP CM Yogi News) చేశారు. రూ. 126 కోట్ల వ్యయంతో నిర్మించిన సంత్ కబీర్ నగర్‌ జైలును ప్రారంభించారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 13, 2021, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details