తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండు తలలు, మూడు చేతులతో అరుదైన శిశువు జననం - అరుదైన శిశువు

Two head Child: మధ్యప్రదేశ్​లో అరుదైన శివువు జన్మించాడు. అతనికి పుట్టుకతోనే రెండు తలలు, మూడు చేతులు ఉన్నాయి. దీంతో వైద్యులు ఇందోర్ ఆస్పత్రికి సిఫారసు చేశారు. అక్కడి వైద్య నిపుణులు చిన్నారిని ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.

unique-child-born-in-ratlam-with-two-head-and-three-hands
రెండు తలలు, మూడు చేతులతో అరుదైన శిశువు జననం

By

Published : Mar 30, 2022, 2:07 PM IST

Updated : Mar 30, 2022, 10:08 PM IST

Unique Child in Ratlam: మధ్యప్రదేశ్ రత్లాం జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళ అరుదైన శిశువుకు జన్మనిచ్చింది. అతనికి రెండు తలలు, మూడు కాళ్లు ఉండటం చూసి వైద్యులు, కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. దీంతో చిన్నారిని ఇందోర్​లోని ఎంవై ఆస్పత్రికి సిఫారసు చేశారు. అక్కడి వైద్య నిపుణులు పసికందును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందంతో పర్యవేక్షిస్తున్నారు.

రెండు తలలు, మూడు చేతులతో అరుదైన శిశువు జననం

Two Head Baby: ఈ అరుదైన చిన్నారికి జన్మనిచ్చిన మహిళ పేరు షాహీన్​. జవ్రాలో నివాసముంటున్నారు. పురిటినొప్పులతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేశారు. తీరా బిడ్డను చూశాక ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. అతనికి రెండు తలలు ఉండటమే గాక మూడు చేతులు ఉన్నాయి. అయితే డెలివరీకి ముందు తీసిన సోనోగ్రఫీ రిపోర్టులో మహిళ కడుపులో కవలలు ఉన్నట్లు తెలిసిందని, కానీ తీరా ప్రసవం అయ్యాక చూస్తే ఒకే శిశువుకు రెండు తలలు ఉన్నాయని వైద్యుల తెలిపారు. రెండు చేతులు సాధారణంగానే ఉండగా.. మూడో చెయ్యి రెండు తలల మధ్య నుంచి ఉన్నట్లు పేర్కొన్నారు. వైద్య పరిభాషలో చెప్పాలంటే దీన్ని పాలీసెఫాలీ కండీషన్ అంటారని, అతికొద్ది మంది చిన్నారుల్లోనే ఇలా అత్యంత అరుదుగా జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం ఈ చిన్నారిని ఇందోర్​ ఎంవై ఆస్పత్రి వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

రెండు తలలు, మూడు చేతులతో అరుదైన శిశువు జననం

ఇదీ చదవండి:భార్యపై అనుమానం... పిల్లలు సహా నలుగురి హత్య!

Last Updated : Mar 30, 2022, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details