కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు గురువారం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో 25 కోట్ల మంది పాల్గొనే అవకాశం ఉందని అంచనా. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీసీ, హెచ్ఎంఎస్, ఏఐయూటీయూసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ బంద్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో బంద్‌కు సిద్ధమవుతున్నారు నాయకులు.
ఈ బంద్‌లో భాగంగా నూతన వ్యవసాయ చట్టాలకు నిరసనగా 26, 27 తేదీల్లో 'చలో పార్లమెంట్' మార్చ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్మికులందరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు ఆయా సంఘాల నేతలు.