తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రధాని సీటు ఖాళీగా లేదు కేసీఆర్​.. వచ్చే ఎన్నికల తర్వాత కూడా మోదీనే ప్రధాని'

BJP Vijaya Sankalpa Sabha in Chevella: యువకుల జీవితాలతో కేసీఆర్ ఆటలాడుతున్నారని కేంద్ర మంత్రి అమిత్​ షా మండిపడ్డారు. లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలో నెట్టారని విమర్శించారు. చేవెళ్లలో బీజేపీ నిర్వహించే విజయ సంకల్ప సభలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్​ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.

Amit Shah
Amit Shah

By

Published : Apr 23, 2023, 7:34 PM IST

Updated : Apr 23, 2023, 9:55 PM IST

BJP Vijaya Sankalpa Sabha in Chevella: తెలంగాణలో కేసీఆర్​ ప్రభుత్వాన్ని గద్దే దింపే వరకూ బీజేపీ కార్యకర్తలు విశ్రమించరని కేంద్ర మంత్రి అమిత్​ షా అన్నారు. పేపర్‌ లీకేజ్‌పై ప్రశ్నించారని బండి సంజయ్‌ను జైల్లో పెట్టారని ఆరోపించారు. జైళ్లకు వెళ్లేందుకు తమ పార్టీ నేతలు, కార్యకర్తలు భయపడరని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. కేసీఆర్​ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.

"బండి సంజయ్‌ను కేసీఆర్‌ జైల్లో వేయించారు. పేపర్‌ లీకేజ్‌పై ప్రశ్నించారని బండి సంజయ్‌ను జైల్లో పెట్టారు. జైళ్లకు వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు భయపడరు. 24 గంటల్లో బండి సంజయ్‌కు బెయిల్‌ వచ్చింది. ఈటలను అసెంబ్లీకి వెళ్లకుండా చేయాలనుకున్నారు. కేంద్రం అందించే పథకాలు క్షేత్రస్థాయికి చేరడం లేదు. మోదీని ప్రజల నుంచి కేసీఆర్‌ దూరం చేయలేరు. కేంద్రంలో ఫుల్ పిక్చర్ చూసే ముందు తెలంగాణలో ట్రైలర్ చూస్తారు." - అమిత్‌ షా, కేంద్ర మంత్రి

తెలంగాణలో పదో తరగతి పేపర్లు, టీఎస్‌పీఎస్‌సీ పేపర్లు ఎందుకు లీక్​ అవుతున్నాయని అమిత్​ షా ప్రశ్నించారు. యువకుల జీవితాలతో కేసీఆర్ ఆటలాడుతున్నారని మండిపడ్డారు. లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలో నెట్టారని విమర్శించారు. లీకేజీపై కేసీఆర్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీ లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

'ప్రధాని సీటు ఖాళీగా లేదు కేసీఆర్​.. వచ్చే ఎన్నికల తర్వాత కూడా మోదీనే ప్రధాని'

"కేసీఆర్‌ ప్రధాని కావాలని కలలు కంటున్నారు. కేసీఆర్‌.. ప్రధాని సీటు ఖాళీగా లేదు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా మోదీనే ప్రధాని. కేసీఆర్‌.. ముందు సీఎం సీటు కాపాడుకుంటే చాలు. అధికారంలోకి వస్తే విమోచన దినం ఘనంగా నిర్వహిస్తాం. మజ్లిస్‌కు బీజేపీ భయపడేది లేదు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం. కారు స్టీరింగ్‌ మజ్లిస్‌ చేతుల్లో ఉంది".- అమిత్‌ షా

తెలంగాణలో హైవేల కోసం లక్ష కోట్లు ఖర్చు చేసినట్లు అమిత్​ షా అన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్రం సరిగ్గా అమలు చేయడం లేదని ఆరోపించిన ఆయన.. కేంద్రం అందించే వేల కోట్లు ప్రజలకు అందుతున్నాయా? అని కార్యకర్తలను అడిగారు. మూడేళ్లలో నాబార్డు ద్వారా రూ.60 వేల కోట్లు అందించామని పేర్కొన్నారు. రామగుండం విద్యుత్‌ కేంద్రం, సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునికీకరణ, ఎంఎంటీఎస్‌ విస్తరణకు నిధులిచ్చామని ప్రకటించారు.

అంతకు ముందు నోవాటెల్ హోటల్​లో రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశమైన అమిత్​ షా.. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ బలోపేతం గురించి నేతలు అనుసరించాల్సిన విధివిధాలను చర్చించారు. సభ అనంతరం నేరుగా రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్​ చేరుకొని అక్కడ ప్రత్యేక విమానంలో కర్ణాటక బయల్దేరారు.

కార్యకర్తలను కాపాడే ఆ పులే.. చేవెళ్ల గడ్డపై అడుగు పెట్టింది: కార్యక్రమంలో మాట్లాడిన బండి సంజయ్​ తనను పోలీసులు అరెస్టు చేసి 8గంటలు రోడ్లపై తిప్పారని అన్నారు. దిల్లీ నుంచి ఫోన్​ రావడంతో పోలీసులు కంగారు పడ్డారని తెలిపారు. కార్యకర్తలను కాపాడే ఆ పులి.. ఇప్పుడు చేవెళ్ల గడ్డపై అడుగు పెట్టిందని తెలిపారు. తెలంగాణలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. తమ పార్టీకి అవకాశమిస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని తెలిపారు. నియంత ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలిస్తామని హెచ్చరించారు.

'కార్యకర్తలను కాపాడే ఆ పులే.. చేవెళ్ల గడ్డపై అడుగు పెట్టింది'

ఇవీ చదవండి:

'రేవంత్​ ముసలి కన్నీళ్లు పెట్టుకుంటే మాకు ఒరిగేదేమీ లేదు'

"మేము అధికారంలోకి వస్తే గ్యాస్​ సిలిండర్​ రూ.500లకే ఇస్తాం"

మీ ప్రసంగాన్ని వినాలనుకుంటున్నాం.. కేసీఆర్​కు యూకే ఎంపీ లేఖ

Last Updated : Apr 23, 2023, 9:55 PM IST

ABOUT THE AUTHOR

...view details