రోడ్డు పక్కన ఉన్న ఒ సాధారణ రెస్టారెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా భోజనం చేశారు. అరిటాకులో భోజనం చేసిన ఆయన ఆ రాష్ట్ర స్పెషల్ సాంబార్‌ను రుచి చూశారు.
విల్లుపురం జాతీయ రహదారిపై అమిత్ షా భోజనం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విల్లుపురంలో నిర్వహించిన 'విజయ సంకల్ప్' బహిరంగ సభలో పాల్గొన్నారు షా. చెన్నై తిరుగు ప్రయాణంలో విల్లుపురం-చెన్నై జాతీయ రహదారి పక్కనున్న రెస్టారెంట్లో భోజనం చేశారు.
ఆ సమయంలో అమిత్ షా తో పాటు కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, వనాతి శ్రీనివాసన్, ఇతర భాజపా నాయకులు కూడా ఉన్నారు.
రోడ్డు పక్కన రెస్టారెంట్లో భోజనం చేస్తోన్న కిషన్ రెడ్డి గతంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీ రోడ్డు పక్కన బేకరీలో టీ తాగి అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఇదీ చూడండి: అన్నదాత ఇంట్లో భోజనం చేసిన అమిత్ షా