ప్రాదేశిక సైన్యానికి(టెరిటోరియల్ ఆర్మీ) చెందిన హవల్దార్ మహ్మద్ సలీం అఖూన్ను పొట్టనపెట్టుకున్న ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి సైనిక బలగాలు. వారి నుంచి రెండు ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్‌లోని నార్తర్న్ కమాండ్ వెల్లడించింది.
ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన సైన్యం - ఉగ్రవాదులు
ఓ సైనికుడిని హత్య చేసిన ఇద్దరు ఉగ్రవాదులను.. భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వారి నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్‌లోని నార్తర్న్ కమాండ్ తెలిపింది.
భద్రత బలగాలు
ముష్కరుల ఏరివేత ఆపరేషన్‌ను సైన్యం, ప్రాదేశిక సైన్యం సంయుక్తంగా నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగపడ్డారు. అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరిపి.. ఇద్దరు ముష్కురులను హతమార్చారు.