తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇద్దరు ఓఎన్​జీసీ అధికారులు సేఫ్

అసోం శివసాగర్ జిల్లాలో అపహరణకు గురైన ముగ్గురు ఓఎన్​జీసీ అధికారుల్లో ఇద్దరు అధికారులను రక్షించాయి భద్రతా దళాలు. ఆర్మీ, అసోం రైఫిల్స్​ సంయుక్తంగా ఆపరేషన్​ చేపట్టి వారిని కాపాడాయి. మరో అధికారి ఆచూకీ ఇంకా తెలియలేదు.

ONGC officials
ఓఎన్​జీసీ అధికారులు

By

Published : Apr 24, 2021, 10:43 AM IST

అసోం శివసాగర్​ జిల్లాలో ఇటీవలే అపహరణకు గురైన ముగ్గురు ఓఎన్​జీసీ అధికారుల్లో.. ఇద్దరు అధికారులను కాపాడాయి భద్రతా దళాలు. భారత ఆర్మీ, ఆసోం రైఫిల్స్​ సంయుక్తంగా ఆపరేషన్​ నిర్వహించి శుక్రవారం రాత్రి అధికారులను కాపాడినట్లు పేర్కొన్నాయి. నాగాలాండ్​ మోన్​ జిల్లాలో వీరిని రక్షించినట్లు తెలిపాయి.

భద్రతా దళాలు రక్షించిన అధికారి

జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ అలకేశ్ సైక్యా, జూనియర్ టెక్నీషియన్ మోహిని మోహన్ గొగోయిని రక్షించాయి భద్రతా దళాలు. మరో జూనియర్ టెక్నీషియన్ రితుల్ సైక్యా ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఆపరేషన్​లో భాగంగా ఓ ఏకే-47 రైఫిల్​ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

భద్రతా దళాలు రక్షించిన అధికారి
ఏకే-47

అసోం శివసాగర్​ జిల్లా లక్వా ఓన్​జీసీ ప్లాంట్​ వద్ద విధులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులు బుధవారం అపహరణకు గురయ్యారు. ఉల్ఫా ఉగ్రసంస్థకు చెందిన వారు అధికారులను కిడ్నాప్​ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి:ఊపిరితిత్తులను బలోపేతం చేసే ఆసనాలు ఇవే..

ABOUT THE AUTHOR

...view details