తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తేనేటీగల దాడిలో గుర్రాలు మృతి.. రూ.కోట్లలో నష్టం! - తేనేటీగల దాడిలో రెండు గుర్రాలు మృతి

తేనెటీగల దాడిలో రెండు మగ గుర్రాలు మృత్యువాతపడ్డాయి. దీంతో రూ. కోట్లు నష్టం వచ్చినట్లు సమాచారం. ఈ గుర్రాలు అమెరికా ఐర్లాండ్​కు చెందినవిగా తెలుస్తోంది. అయితే గుర్రాలు తేనెటీగల దాడిలో చనిపోవడం ఇదే మొదటి ఘటనట.

two horses died by bees attack
తేనేటీగల దాడిలో రెండు గుర్రాలు మృతి

By

Published : Jan 7, 2023, 1:54 PM IST

Updated : Jan 7, 2023, 2:13 PM IST

తేనెటీగల దాడిలో రెండు మగ గుర్రాలు చనిపోయాయి. దీని వల్ల కోట్ల రూపాయల నష్టం కలిగిందట. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని ఓ స్టడ్ ఫామ్​లో జరిగింది. చనిపోయిన గుర్రాలు ఐర్లాండ్​కు చెందిన సానస్ పర్ అక్చం(10 సంవత్సరాలు), అమెరికాకు చెందిన ఎయిర్​ సపోర్ట్​ (15 సంవత్సరాల)గా తెలుస్తోంది.

ఏం జరిగిందంటే...రోజూ లాగే ఎయిర్ సపోర్ట్, సానస్ పర్ అక్చం మేత కోసం బయటకు వెళ్లాయి. మేత మేస్తుండగా వేల సంఖ్యలో తేనెటీగలు ఎక్కడి నుంచో వచ్చి దాడి చేశాయి. ఆ దాడికి తట్టుకోలేక గుర్రాలు అరుస్తూ నేలపై పడ్డాయి. ఇది గమనించిన సంరక్షకులు.. వైద్యులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకుని గుర్రాలకు వైద్యులు చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోయింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో సానస్ పర్ అక్చం మరణించగా.. శుక్రవారం ఉదయం ఎయిర్ సపోర్ట్ మరణించింది. దీంతో యునైటెడ్​ రేంసింగ్​ అండ్ బ్లడ్​స్టాక్ ​బ్రీడర్స్(యూఆర్‌బీబీ)కు కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

ఇవి గెలుపు గుర్రాలే..
అమెరికాకు చెందిన ఎయిర్ సపోర్ట్ హార్స్.. వర్జీనియా డెర్బీ అండ్ పిల్‌గ్రామా స్టేక్స్, ట్రాన్స్‌లానియా స్టేక్స్, సెకండ్ యునైటెడ్ నేషన్స్ స్టేక్స్, థర్డ్ అమెరికన్ టర్ఫ్ స్టేక్స్, సెకండ్ హిల్ ప్రిన్స్ స్టేక్స్ లాంటి రేసుల్లో పాల్గొని విజయం సాధించింది. వాటి యజమానులకు రూ. మిలియన్లు తెచ్చిపెట్టింది. ఇక ఐర్లాండ్‌కు చెందిన గుర్రం సానస్ పెర్ అక్చమ్.. ఫైవ్​స్టార్ రేసులో మూడు సార్లు గెలిచి యజమానులపై కనక వర్షం కురిపించింది. కాగా, ఈ గుర్రాలను ఆరేళ్ల క్రితం అమెరికా, ఐర్లాండ్‌ల నుంచి యూఆర్‌బీబీ ఒక్కో దాన్ని కోటి రూపాయల చొప్పున కొనుగోలు చేసింది. ఈ జాతి గుర్రాల నుంచి పుట్టిన పిల్లలను ప్రపంచవ్యాప్తంగా తరలించామని ఫామ్ మేనేజర్ లోకేశ్​ తెలిపారు.

ఇక, బ్రీడింగ్ పద్ధతి​తో ఈ గుర్రాలు వందల పిల్లలకు జన్మనిచ్చాయి. వీటి పిల్లలకు దేశ విదేశాల్లో మంచి పేరుంది. దీంతో వీటిని రూ.లక్షలు పెట్టి కొని.. గుర్రపు పందేలకు వినియోగిస్తున్నారు. ఈ ఫామ్​ను ప్రభుత్వం 30 ఏళ్ల కాలానికి యూఆర్‌బీబీకి లీజుకు ఇచ్చింది. ఈ లీజు వ్యవధి గత సెప్టెంబర్‌తో ముగిసింది. కానీ కొన్ని కారణాల వల్ల మరికొన్ని రోజుల సమయాన్ని యూఆర్‌బీబీకి ప్రభుత్వం పొడగించింది.

Last Updated : Jan 7, 2023, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details