తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. గుప్తనిధుల కోసం సొరంగం తవ్వుతుండగా.. విషవాయువు పీల్చుకుని ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు అస్వస్థతకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ జరిగింది

నజరెత్ సమీపంలోని తిరువళ్లువార్ కాలనీకి చెందిన ముత్తయ్య(65) ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని తెలుసుకుని అతడి కుమారులు శివమలై(40), శివవేలన్(37) తవ్వకాలు ప్రారంభించారు. నిర్మలా గణపతి(17), రఘుపతి (47) అనే మరో ఇద్దరు వీరికి సాయం చేస్తున్నారు. ఆరు నెలల్లో వీరంతా కలిసి 40 అడుగుల లోతు గొయ్యి, పక్కన మరో ఏడు అడుగుల సొరంగాన్ని తవ్వారు. అయితే సోమవారం ఒక్కసారిగా విషవాయువు వెలువడగా.. ఊపిరాడక మూర్ఛపోయారు.
తవ్వాకాలు జరుపుతున్న ఆ నలుగురికి నీరు ఇవ్వడానికి వెళ్లిన శివవేలెన్ భార్య రూప కూడా స్పృహ తప్పింది. ఆమెను రక్షించడానికి వెళ్లిన పక్కింటి వారు.. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ నలుగుర్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే రఘుపతి, నిర్మలా గణపతి చనిపోయినట్లు అధికారులు నిర్ధరించారు. మిగిలిన వారిని నెల్లై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:పెళ్లి స్కామ్: ఒక వధువు- 13 మంది వరులు!