వీధికుక్కల దాడిలో రెండున్నర ఏళ్ల చిన్నారి మృతిచెందిన విషాద ఘటన పంజాబ్ మన్సా జిల్లాలో జరిగింది.
ఏమైందంటే..?
వీధికుక్కల దాడిలో రెండున్నర ఏళ్ల చిన్నారి మృతిచెందిన విషాద ఘటన పంజాబ్ మన్సా జిల్లాలో జరిగింది.
ఏమైందంటే..?
బాలిక బయట ఆడుకుంటున్న సమయంలో వీధికుక్కలు చిన్నారిని చుట్టుముట్టాయి. ఆమెపై దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఫరిద్కోట్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు.
ఈ క్రమంలో మరొక ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేకపోవడం వల్లే తమ కుమార్తె మృతిచెందిందని వాపోయారు. బాధిత కుటుంబానికి తగిన పరిహారం ప్రభుత్వం ఇవ్వాలని స్థానిక కౌన్సిలర్ కిషన్ సింగ్ తెలిపారు.