తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా ట్విట్టర్​ సేవలకు అంతరాయం!

సామాజిక మాధ్యమం ట్విట్టర్ సేవలకు గురువారం అంతరాయం ఏర్పడింది. ట్వీట్ షేరింగ్, సెర్చింగ్​లో సమస్య తలెత్తినట్లు వినియోగదారులు పేర్కొన్నారు.

twitter
ట్విట్టర్, నిలిచిన సేవలు

By

Published : Jul 1, 2021, 1:33 PM IST

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్​ సేవలకు గురువారంఅంతరాయం ఏర్పడింది. భారత్​లో.. దాదాపు గంట పాటు ట్విట్టర్​లో పోస్టింగ్, సెర్చింగ్, కంటెంట్​ షేరింగ్​ చేయడంలో చాలా మంది ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. గంట తర్వాత తమ సేవలను పునరుద్ధరించినట్లు సామాజిక మాధ్యమం తెలిపింది. అయినప్పటికీ ఈ సమస్య ఇంకా కొనసాగుతున్నట్లు వినియోగాదారులు ఫిర్యాదు చేస్తున్నారు.

ట్విట్టర్ సేవలకు అంతరాయం

క్షమాపణలు..

ఈ అంతరాయానికి గల కారణం ఏమిటనే దానిపై ట్విట్టర్​ స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఈ సమస్య ఏర్పడినందుకు క్షమాపణలు తెలిపింది. "వెబ్​లో.. వినియోగదారుల ఖాతాల్లో ట్వీట్లు​ కనపడట్లేదు. సేవలను పునరుద్ధరించే పనిలో ఉన్నాం," అని ట్విట్టర్​ సపోర్ట్​ ట్వీట్​ చేసింది. గంట తర్వాత.. సేవలు యథావిధిగా కొనసాగించొచ్చని తెలుపుతూ మరో ట్వీట్​ చేసింది.

నిలిచిన ట్విట్టర్ సేవలు

దాదాపు 6 వేలకు పైగా ట్విట్టర్​ యూజర్లు.. మైక్రోబ్లాగింగ్​ సైట్​లో ఏర్పడిన సమస్యలపై కంప్లైంట్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్​లోను ట్విట్టర్​ ఈ సమస్యను ఎదుర్కొంది.

ఇదీ చదవండి:

ట్విట్టర్​లో బూతు బొమ్మలు- వారిపై 10 రోజుల్లో చర్యలు!

ట్విట్టర్ సేవలకు ఏర్పడిన అంతరాయం

ABOUT THE AUTHOR

...view details