తెలంగాణ

telangana

ETV Bharat / bharat

TTD Vigilance: టీటీడీ విజిలెన్స్​ వలలో శాసనమండలి సభ్యుడు.. నకిలీ ఆధార్​ కార్డులతో.. - sheikh shabji

TTD Vigilance: ఓ శాసనమండలి సభ్యుడిని టీటీడీ విజిలెన్స్​ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఆధార్​ కార్డులతో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

TTD Vigilance
TTD Vigilance

By

Published : Apr 21, 2023, 1:54 PM IST

TTD Vigilance: తిరుమల తిరుపతి దేవస్థాన విజిలెన్స్ అధికారుల వలలో ఓ ప్రజాప్రతినిధి చిక్కుకున్నాడు.తరుచూ తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుండడంతో ఆ ప్రజాప్రతినిధిపై విజిలెన్స్ వింగ్ అధికారులకు అదనపు ఈవో కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు. దీంతో వారు ఆ ప్రజాప్రతినిధిని తనిఖీ చేయగా ఫోర్జరీ ఆధార్ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు.

శాసనమండలి సభ్యుడు షేక్ షాబ్జిను.... తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఆధార్ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకొచ్చినట్లు గుర్తించారు. నెల రోజుల్లో 19 సిఫార్సు లేఖలు జారీ చేసి.. ఆరుగురి నుంచి లక్ష రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. భక్తుల ఫిర్యాదుతో ఎమ్మెల్సీ షాబ్జీని అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు... షేక్ షాబ్జిపై తిరుమల ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

శ్రీవారి దర్శనాల్లో శాసనమండలి సభ్యుడు షాబ్జి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామని తిరుమల తిరుపతి విజిలెన్స్‌ వీజీవో గిరిధర్​రావు స్పష్టం చేశారు. షాబ్జీ సిఫార్సు చేసిన భక్తుల ఆధార్ కార్డులు నకిలీవిగా తెలిసిందన్నారు. 14 మందికి టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ షేక్ షాబ్జి కోరారని.. అందుకు అదనపు ఈవో కార్యాలయం 10 టికెట్లు జారీ చేసిందని తెలిపారు. లక్షా ఐదు వేలు తీసుకున్నట్లు భక్తులు తెలిపారన్నారు. డ్రైవర్ రాజుతో పాటు ఎమ్మెల్సీ షాబ్జిని కూడా పోలీసులకు అప్పగించామని.. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్‌ వీజీవో గిరిధర్‌రావు తెలిపారు.

"2021లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షాబ్జి గెలుపొందారు. శ్రీవారి దర్శనాల్లో షాబ్జి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించాం. షాబ్జీ సిఫార్సు చేసిన భక్తుల ఆధార్ కార్డులు నకిలీవిగా తెలిసింది. 14 మందికి టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ షేక్ షాబ్జి కోరారు. అదనపు ఈవో కార్యాలయం 10 టికెట్లు జారీ చేసింది. లక్షా ఐదు వేలు తీసుకున్నట్లు భక్తులు తెలిపారు. షాబ్జిని, డ్రైవర్​ రాజును కూడా పోలీసులకు అప్పగించాం. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలపై దర్యాప్తు చేస్తున్నాం"-టీటీడీ విజిలెన్స్‌ వీజీవో గిరిధర్‌రావు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details