తెలంగాణ

telangana

ETV Bharat / bharat

షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-1... నమ్మిన వాళ్లే గొంతు కోశారు: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌

TSPSC Chairman Janardhan on paper leak issue దురదృష్టకరమైన వాతావరణంలో ప్రెస్‌మీట్‌ పెట్టానని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి అన్నారు. పేపర్‌ లీకేజీపై వస్తున్న వదంతులకు అడ్డుకట్ట వేసేందుకే మీడియా ముందుకొచ్చానన్నారు. ఏఈ పరీక్షపై రేపు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

TSPSC Chairman Janardhan on AE paper leak issue and group 1 exam leak
ఏఈ పరీక్షపై రేపు నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌

By

Published : Mar 14, 2023, 7:50 PM IST

Updated : Mar 14, 2023, 10:30 PM IST

షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-1... నమ్మిన వాళ్లే గొంతు కోశారు: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌

TSPSC Chairman Janardhan on paper leak issue పేపర్‌ లీకేజీ ఘటనపై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి స్పందించారు. దురదృష్టకరమైన వాతావరణంలో ప్రెస్‌మీట్‌ పెడుతున్నట్లు పేర్కొన్నారు. వదంతులకు అడ్డుకట్ట వేసేందుకే ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 30 లక్షల మంది వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారన్న ఆయన... టీఎస్‌పీఎస్సీ వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ను యూపీఎస్సీ కూడా మెచ్చుకుందని స్పష్టం చేశారు. యూపీఎస్సీకి 2 వేల మంది ఉద్యోగులు ఉంటారని తెలిపారు. ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు సగటున ఏటా 4 వేల ఉద్యోగాలు భర్తీ చేసేవారని చెప్పారు. తెలంగాణ వచ్చాక దాదాపు 35 వేల ఉద్యోగాల భర్తీ అవుతున్నట్లు వెల్లడించారు.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం దాదాపు 25 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. టీఎస్‌పీఎస్సీ అనేక కొత్త విధానాలు తెచ్చింది. గ్రూప్‌1 ప్రిలిమ్స్‌లో దేశంలోనే ఎక్కడా లేని విధంగా మల్టిపుల్‌ జంబ్లింగ్‌ చేశాం. గ్రూప్‌1 ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు, సమాధానాలు మల్టిపుల్‌ జంబ్లింగ్‌ చేశాం. ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమాలు జరగొద్దనే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అక్టోబర్‌ 16న గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించాం. అభ్యంతరాల స్వీకరణకు 5 రోజులు సమయం ఇచ్చాం.'' అని పేర్కొన్నారు.

''నిపుణులను సంప్రదించిన తర్వాత గ్రూప్‌1 ఫైనల్‌ కీ ఇచ్చాం. గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ వడపోత పరీక్ష మాత్రమే.. అందుకే మార్కులు ఇవ్వట్లేదు. పరీక్షల నిర్వహణలో మానవ ప్రమేయాన్ని సాధ్యమైనంతగా తగ్గించాం. టౌన్‌ ప్లానింగ్‌ పరీక్షకు ముందు రోజు మాకు కొంత సమాచారం వచ్చింది. మాకు సమాచారం రాగానే పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసుల దర్యాప్తులో 9 మంది నిందితులుగా తేలారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి రాజశేఖర్‌కు ఐపీ అడ్రెస్‌లు తెలిసే అవకాశం ఉంది.'' అని వివరించారు.

రాజశేఖర్‌ కీలక సమాచారం యాక్సెస్‌ చేసినట్టు భావిస్తున్నాం. ఏఎస్‌ఓ ప్రవీణ్‌.. రాజశేఖర్‌ సాయంతో పేపర్లు సంపాదించాడు. ప్రవీణ్‌.. రూ.10 లక్షల కోసం పేపర్లు అమ్మాడని తెలిసింది. లీకేజీ పరిణామాల నేపథ్యంలో అత్యవసర సమావేశం నిర్వహించాం. నా కుమార్తె గ్రూప్‌1 ప్రిలిమ్స్ రాసిందని వదంతులు వచ్చాయి. నా పిల్లలు ఎవరూ గ్రూప్‌1 ప్రిలిమ్స్ రాయలేదు. ఏఈ పరీక్షపై రేపు నిర్ణయం తీసుకుంటాం. ఏఈ పరీక్షపై ఇంకా నివేదిక రావాల్సి ఉంది. ప్రవీణ్‌కు గ్రూప్‌1 ప్రిలిమ్స్‌లో 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమే.. అని తెలిపారు.

పరీక్షల్లో విజేతలు కాని వారు కోర్టులకు వెళ్లడం సాధారణమేనన్న జనార్దన్.. తమ సమయం సగం కోర్టు కేసులకే సరిపోతోందన్నారు. పోలీసులు లీకేజీ కేసుపై చాలా వేగంగా స్పందించారని తెలిపారు. లీకేజీలో ప్రమేయం ఉన్న ఐదుగురి ఉద్యోగాలు పోతాయని తెలిపారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌, రేణుక, రేణుక భర్త ఉద్యోగాలు పోతాయని చెప్పారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చాక వాస్తవం తెలుస్తుందన్నారు. కమిషన్‌లో నమ్మిన వాళ్లే గొంతు కోశారని ఆవేదన చెందారు. గ్రూప్‌1 మెయిన్స్‌ జూన్‌ 5 నుంచే నిర్వహించాలని నిర్ణయమన్నారు. గ్రూప్‌1 మెయిన్స్‌ యథాతథంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇక టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీని గవర్నర్ తమిళిసై తీవ్రంగా పరిగణించారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీకి గవర్నర్ ఆదేశించారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేసింది. ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు ప్రతిపాదించాలని సూచించారు.

ఇవీ చూడండి..

Last Updated : Mar 14, 2023, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details