TSGENCO AE Notification 2023 : హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలో 339 అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది ఆ సంస్థ. ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో ఈ ఖాళీలను నింపనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఓ నోటిఫికేషన్ సైతం విడుదుల చేసింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు జెన్కో ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఖాళీల వివరాలు..
- అసిస్టెంట్ ఇంజినీర్- 339 పోస్టులు
- లిమిటెడ్ రిక్రూట్మెంట్- 94 ఖాళీలు
- జనరల్ రిక్రూట్మెంట్- 245 ఖాళీలు
- విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్.
అర్హతలు..
బ్యాచిలర్స్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్స్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్/ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ పవర్/ పవర్ ఎలక్ట్రానిక్స్/ సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి..
2023 జులై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
జీత భత్యాలు..
నెలకు రూ.65,600 - రూ.1,31,220.
ఎంపిక విధానం..
మొదట రాత పరీక్ష ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అనంతరం మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన వివరాలు..
- ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- ఆన్లైన్లో దరఖాస్తులు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 2023 అక్టోబర్ 7
- ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 2023 అక్టోబర్ 29
- దరఖాస్తు రుసుము : రూ.400.
- రాత పరీక్ష తేదీ: 03-12-2023.
వీఎంఎంసీ- సఫ్దర్జంగ్ హాస్పిటల్లో 909 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు
VMMC Safdarjung Hospital Recruitment 2023 :న్యూదిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, కళావతి సరన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్లు సంయుక్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన పలు పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టులు : 909 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు
- ఫ్యామిలీ వెల్ఫేర్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేటర్, రేడియోగ్రాఫర్, ఎక్స్-రే అసిస్టెంట్, ఈసీజీ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, ఫార్మసిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆపరేషన్ థియేటర్ అటెండెంట్, నర్సింగ్ అటెండెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, మెడికల్ సోషల్ వెల్ఫేర్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్, ఎక్స్-రే టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, టెక్నీషియన్, సీనియర్ కార్డియాక్ టెక్నీషియన్, జూనియర్ కార్డియాక్ టెక్నీషియన్, డెంటల్ మెకానిక్, కేర్ టేకర్, చైర్-సైడ్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, జూనియర్ ఫొటోగ్రాఫర్, డ్రస్సర్, సైకాలజిస్ట్, లైబ్రరీ క్లర్క్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అర్హత..
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, డిప్లొమా, సర్టిఫికెట్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు..
- జనరల్ అభ్యర్థులకు రూ.600
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 25-10-2023 అక్టోబర్ 25
- ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 26-10-2023 అక్టోబర్ 26
- అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ తేదీ: 2023 నవంబర్ మొదటి వారం
BEL Engineering Jobs 2023 : బీఈ, బీటెక్ అర్హతతో.. BELలో ప్రొబేషనరీ ఇంజినీర్, ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!
ISRO Apprentice Jobs 2023 : ఇంజినీరింగ్ అర్హతతో.. ఇస్రోలో 435 అప్రెంటీస్ పోస్టులు.. రేపే సెలక్షన్!