తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆన్​లైన్​ రమ్మీలో రూ.50 లక్షలు లాస్​.. అప్పు తీర్చేందుకు ప్రభుత్వ ఉద్యోగి బ్యాంకు దొంగతనం.. చివరకు.. - నకిలీ పోలీసుల బాగోతం

Trissur Bank Robbery : ఆన్​లైన్​లో రమ్మీ గేమ్​ ఆడి రూ. 50 లక్షలు పోగొట్టుకున్న ఓ వ్యక్తి.. బ్యాంక్ దోపిడీకి సిద్ధం అయ్యాడు. చివరికి దొంగతనం చేయడంలో విఫలమై పోలీసులకు చిక్కాడు. ఇంతకీ ఆ కథ ఏంటంటే..

Trissur Bank Robbery
ఆన్​లైన్​ రమ్మీలో లక్షలు పోగొట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగి

By

Published : Jun 18, 2023, 8:56 PM IST

Updated : Jun 18, 2023, 10:25 PM IST

Trissur Bank Robbery : ఆన్​లైన్​లో రమ్మీ గేమ్​కు బానిస అయిన ఓ ప్రభుత్వ​ ఉద్యోగి.. దాదాపు రూ. 50 లక్షల పోగొట్టుకొని అప్పుల పాలయ్యాడు. జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో అర్థం కాక స్థానికంగా ఉన్న బ్యాంక్​ను లూటీ చేయాలనుకున్నాడు. అందుకోసం ప్లాన్ చేసి బ్యాంక్​లోకి ప్రవేశించాడు. కానీ దొంగతనం చేసే క్రమంలో దొరికిపోయి జైలు పాలయ్యాడు. కేరళ త్రిస్సూర్​లో జరిగిందీ ఘటన.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
త్రిస్సూర్ పరిధిలోని తెక్కుంకరా గ్రామంలో లీజో అనే వ్యక్తి ఫీల్డ్ అసిస్టెంట్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత కొద్ది కాలంగా లీజో ఆన్​లైన్​లో రమ్మీ గేమ్​ ఆడుతున్నాడు. ఆన్​లైన్​ గేమ్​కు బానిస అయిన లీజో రూ. 50 లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన లీజో అప్పు.. సుమారు రూ. 73 లక్షలకు చేరుకుంది. ఆర్థిక ఒత్తిళ్లకు గురైన లీజో.. బ్యాంక్​ను లూటీ చేయాలని నిర్ణయించుకున్నాడు.

బ్యాంకులో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4.30 నిమిషాలు సమయంలో.. తాను గతంలో రుణం పొందిన ఫెడరల్​ బ్యాంక్​లోకి ప్రవేశించాడు. బ్యాంక్​ సిబ్బందిపై పెట్రోల్ దాడికి పాల్పడ్డాడు. బ్యాంక్​ అసిస్టెంట్ మేనేజర్ వద్దకు వెళ్లి లాకర్ తాళాలు ఇవ్వాల్సిందిగా బెదిరించాడు. ఆ సమయంలో బ్యాంక్​లో ఉన్న కస్టమర్లు అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. అయితే మొదటగా లీజోను మతిస్థిమితం కోల్పోయిన వాడిగా అనిమానించిన పోలీసులు.. అయితే విచారణలో నిందితుడు అసలు విషయం బయటపెట్టాడు.

'ఎక్కువ వడ్డీ రేటుకు అప్పులు తెచ్చి మరీ ఆన్​లైన్​లో రమ్మీ ఆడేవాణ్ని. ఇల్లు కోసం తీసుకున్న లోన్ రూ. 23 లక్షలు, రమ్మీలో పోగొట్టుకున్న రూ. 50 లక్షలు కలిపి మొత్తం రూ. 73 లక్షల అప్పులో కూరుకుపోయాను. వారం రోజుల నుంచి తీవ్ర మానసిక ఒత్తిడి లోనయ్యా. అందుకే బ్యాంక్​ దొంగతనం చేయాలనుకున్నా' అని లీజో పోలీసులకు తెలిపాడు. లీజోపై దొంగతనం కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేసి.. నిందితుడి బ్యాంక్ లావాదేవీలు పరిశీలించి, ఆధారాలు సేకరిస్తున్నట్లు వదకంచెరి పోలీసులు తెలిపారు.

పట్టుబడ్డ నకిలీ పోలీసుల ముఠా..
ఖాకీ దుస్తులు ధరించి దొంగతనాలకు పాల్పడిన నలుగురు కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నకిలీ ఖాకీ దుస్తులు, రూ. 53 వేల నగదుతో పాటు, దొంగతనాలకు ఉపయోగించిన మోటర్​ సైకిల్​, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్​ రాష్ట్రం మోగాలో జరిగిందీ ఘటన..

పోలీసుల అదుపులో నిందితులు

ఇలా పట్టుబడ్డారు..
మోగా జిల్లాకు చెందిన అజయ్ ప్రేమ్​నగర్ వీధి నెం.1 లో నివాసముంటున్నాడు. అతడికి పాత దానా మండిలో హోల్​సేల్​ కిరాణా షాపు ఉంది. అయితే ఈ నెల 8వ తేదీన అజయ్.. రాత్రి 8.30 గంటల సమయంలో షాపు మూసివేసి తన సోదరుడు రాజ్​ కుమార్​తో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. రెండు మూడు రోజుల వ్యాపార నగదు సుమారు రూ. 5లక్షలు ఓ బ్యాగులో పట్టుకుని వెళ్తుండగా.. సింగ్లా హాస్పిటల్ రోడ్డు వద్దకు చేరుకోగానే వారిని నలుగురు నకిలీ ఖాకీ దుస్తులు ధరించిన ముగ్గురు అడ్డగించారు. వారిని కారులో ఎక్కించుకొని వారి వద్ద ఉన్న నగదు, బంగారం లాక్కొని.. స్థానికంగా ఉన్న బైపాస్​ రోడ్డులో వదిలి వెళ్లిపోయారు.

ఈ విషయమై బాధితుడు అజయ్ మోగా పట్టణంలోని సౌత్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఇన్వెస్టిగేషన్ అధికారి రాజ్ సింగ్ తన టీమ్​తో కలిసి నిందితుల కోసం గ్రూపులుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా నిందితులు బద్నీ కలాన్ రోడ్డులో ఉండగా.. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Last Updated : Jun 18, 2023, 10:25 PM IST

ABOUT THE AUTHOR

...view details