Best Travelling Tips :ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. మనుషులు ఆల్మోస్ట్ యంత్రాలుగా మారిపోయారు. ఏ కొద్ది మందినో మినహాయిస్తే.. మెజారిటీ జనం జీవితాన్ని ఆస్వాదించడం అన్నదే మరిచిపోయారు. రకరకాల సమస్యలు బుర్రలో చేరి తొలిచేస్తుంటే.. ఆ చిక్కు ముళ్లను సాల్వ్ చేసుకునే పనిలోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి మిమ్మల్ని ఎవరో బయట పడేయలేరని.. మిమ్మల్ని మీరే ఒడ్డున పడేసుకోవాలని చెప్తున్నారు మానసిక నిపుణులు! ఇందుకోసం పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండడతోపాటు.. ప్రతి ఒక్కరు తప్పకుండా టూర్లకు వెళ్లి రావాలని సూచిస్తున్నారు. ఒత్తిడి, ఆందోళన తగ్గడానికి.. జీవితంలో సంతోషం పెంచుకోవడానికి ఇది చాలా అవసరమని అంటున్నారు. అంతేకాదు.. టూర్ ఎలా ప్లాన్ చేస్తే సక్సెస్ అవుతుందో కూడా తెలియజేస్తున్నారు.
బడ్జెట్‌ను అంచనా వేసుకోండి :
ట్రావెలింగ్ చేయడానికి ప్రపంచంలో అనేక మార్గాలున్నాయి. మీకు ఉన్న సమయాన్ని బట్టి మీరు ఎక్కడికి వెళ్లాలో ముందుగానే నిర్ణయించుకోండి. అందుకోసం ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రచించుకోండి. మీరు ఎన్ని రోజులు టూర్‌కు వెళ్లాలనుకుంటున్నారో దానికి కావాల్సిన బడ్జెట్ ఎంతో సిద్ధం చేసుకోండి. దీనివల్ల మీకు ప్రయాణంలో ఇబ్బంది కలగకుండా ఉంటుంది. వీలైతే మీరు అంచనా వేసుకున్న అమౌంట్ కంటే ఎక్కువగానే క్యారీ చేయాలి. ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు అది మీకు ఉపయోగపడుతుంది.
గ్యాడ్జెట్‌లకు దూరంగా :
మీరు ఎక్కడికైనా టూర్‌కు వెళ్లినట్లయితే.. ఫోన్, ల్యాప్ టాప్ వంటివి దూరం పెట్టండి. సాధ్యమైనంత వరకు అక్కడ ఉన్న ప్రకృతి అందాలు, ప్రజల జీవన విధానం, వాతావరణ పరిస్థితులను గమనించండి. ఫ్యూచర్‌లో మళ్లీ మీరు ఆ ప్రదేశానికి వెళ్లకపోవచ్చు. కాబట్టి.. వీలైనంత వరకు ప్రకృతి అందాల్నీ మీ మనస్సులో పదిలంగా ఉండేలా చూసుకోండి.
ట్రిప్ ప్లాన్ చేసుకోండి :
మన జీవితం కొనసాగినన్ని రోజులూ.. బాధ్యతలు, ఒత్తిడి, ఆందోళన వంటివి ఉంటూనే ఉంటాయి. అవి ఎక్కడికీ పోవు. కాబట్టి.. వాటికి కాస్త విరామం ఇవ్వండి. సంవత్సరానికి కనీసం ఒక రెండు టూర్‌లనైనా ప్లాన్ చేసుకోండి. దీనివల్ల ఆ మధురమైన క్షణాలు మనకు ఎప్పటికీ గుర్తుండి పోయేలా చేస్తాయి. ఈ ట్రిప్‌లో మీరు ఎక్కడైతే స్టే చేయాలనుకుంటున్నారో అక్కడ ముందుగానే హోటల్స్, క్యాంపింగ్ సైట్‌లను బుక్ చేసుకోండి. దీనివల్ల మీకు టైమ్, మనీ రెండూ సేవ్ అవుతాయి.