రైతు నిరసనలు ఉద్ధృతం చేయడానికి సంబంధించిన టూల్‌కిట్ డాక్యుమెంట్ కేసులో ఇద్దరు నిందితులకు దిల్లీ పోలీసులు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశారు. నిందితులు శాంతను, నికితా జాకబ్.. డాక్యుమెంట్లు రూపొందిచడంలో కీలక పాత్ర పోషించారని, ఖలిస్థానీ ఉద్యమకారులతోనూ వీరికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. నికిత, శాంతను ఆ టూల్‌కిట్‌ను రూపొందించగా, ప్రధాన నిందితురాలైన దిశ వాటిని పర్యవేక్షించేదని వెల్లడించారు.
'టూల్‌కిట్' కేసులో ఇద్దరికి నాన్ బెయిలబుల్ వారెంట్ - గ్రెటా థన్‌బర్గ్
రైతు నిరసనలకు సంబంధించిన టూల్‌కిట్ కేసులో ఇద్దరు నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంటును జారీ చేశారు దిల్లీ పోలీసులు. నిందితులు శాంతను, నికితా జాకబ్ కోసం గాలిస్తున్నారు.
టూల్‌కిట్ కేసులో ఇద్దరికి నాన్ బెయిలబుల్ వారెంట్
భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు ఖలిస్థానీ సంస్థ పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్‌తో వీరు చేతులు కలిపారని అధికారులు పేర్కొన్నారు. వీరిని అరెస్టు చేసేందుకు ముంబయి సహా పలు ప్రాంతాల్లో అధికారులు గాలింపును ముమ్మరం చేశారు. దిశ రవిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి :థన్‌బర్గ్ టూల్‌కిట్ కేసులో పోలీసు కస్టడీకి దిశ