తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టమాటా పంటకు సీసీ కెమెరాలతో రక్షణ.. చోరీ భయంతో రైతుల జాగ్రత్తలు - టమాటా తోటలో రైతులు ఏర్పాటు చేసిన సీసీటీవీ

Tomato CCTV Camera : ప్రస్తుతం టమాటా ధరలు మండిపోతున్నాయి. దీంతో దొంగలు టమాటాలను పొలాల నుంచే ఎత్తుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళనకు గురవుతూ.. పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన రైతు సోదరులు టమాటా తోటకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి.. తమ వ్యవసాయ క్షేత్రంలో ప్రతి కదలికను గమనిస్తున్నారు.

Tomato CCTV Camera
Tomato CCTV Camera

By

Published : Jul 21, 2023, 12:41 PM IST

టమాటా పంటకు సీసీ కెమెరాతో భద్రత.. చోరీ భయంతో రైతుల జాగ్రత్త

Tomato CCTV Camera : దేశవ్యాప్తంగా టమాటాల ధరలు మండిపోతున్నాయి. కొన్ని చోట్ల వీటి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దీంతో సామాన్యులు టమాటాలు కొనడం కష్టంగా మారింది. అయితే ధర పెరిగితే సాధారణంగా రైతులు అనందపడతారు. కానీ, టమాటాలను దొంగతనం చేయడం వంటి పరిణామాలు రైతులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. చేతికి వచ్చిన పంటను మంచి రేటుకు అమ్ముకుందామనుకునే రైతులు.. ఎక్కడ దొంగలు ఎత్తుకెళ్తారో అని రాత్రింబవళ్లు కాపలా ఉండాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితే కర్ణాటక.. మైసూరు జిల్లాలోని ఇద్దరు రైతు సోదరులకు ఎదురైంది.

హున్​సుర్​ మండలంలోని కుప్పే గ్రామానికి చెందిన ఇద్దరు రైతు సోదరులకు నగేశ్​, కృష్ణకు 10 ఎకరాలు పొలం ఉంది. అందులో మూడున్నర ఎకరాల్లో టమాటా సాగు చేశారు. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో.. వీరి పొలంలో దొంగలు పడ్డారు. అయితే, వారిని చాకచక్యంగా పట్టుకున్న రైతులు.. బిలికెరే పోలీసులకు అప్పగించారు. దీంతో ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా ఉండేందుకు రైతులు ఏదైనా చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం రెండు సీసీటీవీ కెమెరాలను అమర్చి.. తమ మొబైల్​ ఫోన్లకు అనుసంధానం చేసుకున్నారు. దీని ద్వారా పొలంలో ప్రతి కదలికను గమనిస్తున్నారు. ఏదైనా అనుమానస్పదంగా అనిపిస్తే వెంటనే స్పందిస్తున్నారు.

సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసిన రైతు సోదరులు

Tomato price Hike : "ఎకరానికి 10 వేల మొక్కలు నాటి, బిందు సేద్యం ద్వారా సాగు చేశాం. ఇప్పటివరకు 15 సార్లు టమాటా సాగు చేశాం. కిలో సగటున రూ.70 నుంచి రూ.75 విక్రయించాం. ఇప్పటివరకు టమాటా పంటల ద్వారా రూ. 4 లక్షల ఆదాయం వచ్చింది. ఆగస్టులో మళ్లీ మొక్కలు నాటుతాం" అని రైతు సోదరులు తెలిపారు.

టమాటాలతో రైతు సోదరులు
టమాటా ధర పెరగడం వల్ల మార్కెట్‌లో గిరాకీ పెరిగింది. కేరళకు చెందిన వ్యాపారులు నేరుగా పొలానికి వచ్చి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్​ మార్కెట్​ కమిటీ- ఎపీఎంసీలో ఉన్న ధరకే కొనుగోలు చేస్తున్నారు. దీని ద్వారా ఆర్థికంగా లాభపడ్డామని ఈ రైతు సోదరులు చెబుతున్నారు. బయట బ్యాంకులను నుంచి లోన్​లు, ఇతర అప్పులు తీసుకోకుండా.. వ్యవసాయం ద్వారా వచ్చిన లాభంతో ట్రాక్టర్ ​కొని.. ఇల్లు కూడా కట్టుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా 24 మేకలు, 12 పశువులను కూడా పెంచుతున్నారు. సేంద్రీయ పద్ధతుల్లో కూడా సాగు చేసి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details