దేశ చరిత్రలో భయానక మారణ హోమాల్లో ఒకటైన 26/11 ముంబయి ఉగ్రదాడులు జరిగి నేటికి 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నాటి దాడుల్లో వీర మరణం పొందిన పోలీసులు, భద్రతా సిబ్బందికి నివాళులర్పించేందుకుగాను ముంబయి పోలీసులు గురువారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించున్నారు.
26/11 ముంబయి ఉగ్ర దాడులకు 12 ఏళ్లు - ఉగ్రదాడులు
ముంబయిలో జరిగిన మారణ హోమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో 26/11 అమరుల కుటుంబ సభ్యులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు ముంబయి పోలీసులు.
26/11 ముంబయి ఉగ్ర దాడులు
దక్షిణ ముంబయిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో కొత్తగా నిర్మించిన స్మారకం వద్ద నిర్వహించే ఈ కార్యక్రమానికి 26/11 అమర వీరుల కుటుంబ సభ్యులు హాజరుకానున్నరు. వారితో పాటు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తదితరులు హాజరువుతారు.
Last Updated : Nov 26, 2020, 7:42 AM IST