పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా బంగాల్ కార్మిక శాఖ మంత్రి బెచరమ్ మన్నా.. సైకిల్ యాత్ర చేపట్టారు. హూగ్లీ జిల్లాలోని తన నివాసం నుంచి రాష్ట్ర అసెంబ్లీ వరకు దాదాపు 38 కిలోమీటర్లు సైకిల్ తొక్కారు. కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు రూ.100 దాటిన నేపథ్యంలో ఈ మేరకు నిరసన చేపట్టారు.
ఉదయం 8 గంటలకు సైకిల్‌పై ప్రారంభమైన మన్నా.. మధ్యాహ్నం 12.30 గంటలకు కోల్‌కతాలోని అసెంబ్లీ భవనాన్ని చేరుకున్నారు.
"కేంద్రంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. అందుకే మేము నిరసన చేపడుతున్నాము."