తెలంగాణ

telangana

By

Published : Sep 21, 2021, 9:28 AM IST

Updated : Sep 21, 2021, 11:46 AM IST

ETV Bharat / bharat

10 రోజులుగా బౌద్ధ సన్యాసి పార్థివదేహానికి పూజలు

ఉత్తర కన్నడ జిల్లా ముందగొడు తాలూకాలోని టిబెటన్​ కాలనీలో గెషే ఫుంట్​సోక్​ అనే సన్యాసి 10 రోజుల క్రితం పరమపదించారు. ఆయన పార్థివదేహానికి అక్కడి బౌద్ధ సన్యాసులు పూజలు చేస్తున్నారు. ఆయన ఆత్మ దేహాన్ని విడిచిపెట్టలేదని అంటున్నారు. ఆత్మ దేహాన్ని వీడిన అనంతరం అంత్యక్రియలు ఉంటాయని చెబుతున్నారు.

Tibetan monk died 10 days back.. Still his body worshipped by Bhikkhus
గెషే ఫుంట్‌సోక్ పార్థివకాయం

కర్ణాటకలో.. గెషే ఫుంట్‌సోక్ అనే సన్యాసి 10రోజుల ముందు శివైక్యం పొందారు. ఆయన పార్థివదేశాన్ని భిక్కులు(బౌద్ధ సన్యాసులు) ఇప్పటికీ ప్రార్థనలు చేస్తున్నారు. సన్యాసి ఆత్మ దేహాన్ని ఇంకా విడిచిపెట్టలేదని.. అందుకే పూజలు చేస్తున్నామని అంటున్నారు.

గెషే ఫుంట్‌సోక్ పార్థివకాయం

ఉత్తర కన్నడ జిల్లా ముందగొడు తాలూకాలోని టిబెటన్​ కాలనీలో నివాసముంటున్న గెషే సన్యాసి.. ఈ నెల 9న పరమపదించారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని భద్రపరిచిన భిక్కులు.. రోజు ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన ఆత్మ.. దేహాన్ని విడిచిపెట్టిందా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు.. సన్యాసుల్లో ఒకరు ఎప్పటికప్పుడు ఆ గదిలోకి వెళ్లి చూసి వస్తున్నారు. నోరు, ముక్కులో నుంచి ద్రవం బయటకు వచ్చినా, వాసన వచ్చినా ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినట్టు వారు విశ్వసిస్తారు.

గెషే ఫుంట్‌సోక్
గెషే ఫుంట్‌సోక్

టిబెటన్​ కాలనీలో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. నలుగురు సన్యాసులు.. దేహాన్ని విడిచిపెట్టగా.. ఆ తర్వాత వారికి పూజలు చేశారు. 7-15 రోజుల మధ్య వారి అంత్రక్రియలు జరిగాయి.

ఇదీ చూడండి:-మహంత్​ నరేంద్ర గిరి అనుమానాస్పద మృతి- మోదీ విచారం

Last Updated : Sep 21, 2021, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details