ఒడిశాలోని రాయగఢ్ జిల్లాలో విషాదం (Odisha crime news) చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంకులోకి దిగిన ముగ్గురు కార్మికులు.. ఊపిరాడక (Septic tank death) మరణించారు. మరో కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. టికిరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచాలీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
పంచాలీ గ్రామంలోని ఓ ఇంట్లో కూలీలు సెప్టిక్ ట్యాంకు నిర్మిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ సమయంలోనే ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగిందని చెప్పారు.