తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో పెరుగుతున్న జికా కేసులు - కేరళలో జికా వైరస్​ కేసులు

కేరళలో జికా వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆ రాష్ట్రంలో మరో మూడు జికా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44కు చేరింది.

zika
జికా వైరస్​

By

Published : Jul 22, 2021, 10:52 PM IST

కరోనా విజృంభణతో వణుకుతున్న కేరళలో జికా వైరస్‌ కేసులు కూడా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి. గురువారం మరో మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44కి చేరింది.

తాజాగా ఈ వైరస్‌ సోకిన వారిలో తిరువనంతపురానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తితో పాటు పెట్ట ప్రాంతంలోని 38 ఏళ్ల వ్యక్తి, అనయరకు చెందిన మూడేళ్ల బాలుడు ఉన్నట్టు వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. తిరువనంతపురంలోని మెడికల్‌ వైరాలజీ ల్యాబ్‌లోనే ఈ కేసులు నిర్ధారణ జరిగిందన్నారు.ప్రస్తుతం ఆరుగురు చికిత్స పొందుతున్నారని వివరించారు.

వైద్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం జికా సోకిన వారిలో చాలా మంది ఆస్పత్రుల్లో చేరడంలేదని, అందరి పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. మరోవైపు, రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు కూడా భారీగానే నమోదవుతున్నాయి. గురువారం 12,818 కొత్త కేసులు నమోదు కాగా.. 122 మంది మృతిచెందారు.

ఇదీ చూడండి:'కరోనా మరణాల లెక్క పక్కా- అవన్నీ అసత్యాలే!'

ABOUT THE AUTHOR

...view details