రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రజీయసర్ ప్రాంతం గుండా వెళుతున్న ఆర్మీ వాహనం అదుపుతప్పి బోల్తా పడడం వల్ల దానికి మంటలు అంటున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు సైనికులకు మంటలు అంటుకొని సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు జవాన్లు తీవ్ర గాయాలతో బయటపడ్డారు.
వాహనం బోల్తా- ముగ్గురు జవాన్లు సజీవ దహనం - రజీయసర్
రాజస్థాన్లో ఆర్మీ వాహనం అదుపుతప్పి బోల్తా పడడం వల్ల మంటలు చెలరేగాయి. అందులో ఉన్న ముగ్గురు సైనికులు సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వాహనం బోల్తా..ముగ్గురు జవాన్ల మృతి
సైనికులు వాహనం నుంచి బయటికి రావడానికి ప్రయత్నించారని కానీ సాధ్యపడలేదని విక్రమ్ తివారీ అనే పోలీసు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని అన్నారు .
ఇదీ చదవండి:అంబానీ ఇంటి వద్ద 'బాంబుల కారు' కేసులో మరో ట్విస్ట్!