తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Electric shock : నూతన గృహ ప్రవేశం.. విద్యుత్ షాక్​తో నలుగురు మృతి - అన్నమయ్య జిల్లాలో విషాదం

Electric shock : గృహప్రవేశ కార్యక్రమంలో విద్యుదాఘాతం చోటుచేసుకుని నలుగురు మృతి చెందారు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని కానుగామాకుల పల్లెలో ఈ విషాదం చోటు చేసుకుంది. షామియానా.. భారీగా వీచిన గాలులతో పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలపై పడటంతో ప్రమాదం జరిగింది. బంధుమిత్రుల ఆనందోత్సాహాల నడుము జరగాల్సిన కార్యక్రమం ఈ ప్రమాదం కారణంగా విషాదం మిగిల్చింది.

విద్యుత్ షాక్​తో ముగ్గురు మృతి
విద్యుత్ షాక్​తో ముగ్గురు మృతి

By

Published : Apr 14, 2023, 4:51 PM IST

Updated : Apr 14, 2023, 6:12 PM IST

Electric shock : అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని కానుగామాకుల పల్లెలో విషాదం చోటు చేసుకుంది. నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశ కార్యక్రమంలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. గృహప్రవేశ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన షామియానా.. భారీగా వీచిన గాలులతో పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలపై పడటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృత్యువాతపడ్డారు.

గ్రామంలో విషాద ఛాయలు..మృతులు గృహ ప్రవేశానికి వచ్చిన కొత్తకోట మండలం కొత్తపల్లెకు చెందిన అవ్వ, మనవడు చిన్నలక్ష్మమ్మ, విజయ ప్రకాశ్ గా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా కొత్తకోటకు చెందిన శాంతకుమారి, వోడుగులవారిపల్లెకు చెందిన లక్ష్మణ ప్రాణాలు కోల్పోయారు. ఆనందాల మధ్య జరుగుతున్న గృహ ప్రవేశం కార్యక్రమంలో ప్రమాదం జరిగి నలుగురు ప్రాణాలు కొల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆదోనిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్.. రూ.4కోట్ల నష్టం... కర్నూలు జిల్లా ఆదోనిలో గల పత్తి పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాధవరం రోడ్డులో ఉన్న నాగరాజు అండ్ సన్స్ కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పత్తి కాలిపోయింది. అగ్ని ప్రమాదంలో దాదాపు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే పత్తి కాలి బూడిద అయ్యిందని యజమాని వాపోయాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పరిశ్రమలో రూ.10 కోట్ల వరకు పత్తి నిల్వలు ఉన్నాయని... కూలీలు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో చాలా పత్తి బేలు కాలిపోకుండా చూశారని యాజమాని నాగరాజు తెలిపాడు.

వ్యక్తి అనుమానాస్పద మృతి.. ప్రకాశం జిల్లా కొండేపి గ్రామంలో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద కాపలాగా ఉన్నా సంఘం సుబ్బారెడ్డి అనుమానస్పదంగా మృతి చెందాడు. దోమతెర వేసుకొని మద్యం దుకాణం ముందు నిద్రపోయిన సుబ్బారెడ్డి.. ఉదయం చూసేసరికి విగత జీవిగా పడి ఉన్నాడు. తలపై బలమైన గాయాలు ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడి చేయడం వల్ల మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పోలీసుల అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుకాణం ముందు సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 14, 2023, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details