మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. మొత్తం 36 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్టు ముంబయిలోని జేజే ఆస్పత్రి వర్గాలు సోమవారం తెలిపాయి.
మహారాష్ట్రలో మార్చి 1న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 6,7న అక్కడ కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. అందులో భాగంగా 2,746 నమూనాలను పరీక్షించగా.. 36 వైరస్ కేసులు వెలుగుచూశాయి. మొత్తంగా వారం రోజుల వ్యవధిలో 3,900 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 42మందికి పాజిటివ్‌గా తేలింది.
ఛత్తీస్‌గఢ్‌లోనూ..