ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి డాక్టర్లను వింత డిమాండ్ చేశాడు. వెంట తెచ్చుకున్న లడ్డూ గోపాల్ విగ్రహానికి చెయ్యి విరిగిందని.. వెంటనే దానికి ప్లాస్టర్‌తో కట్టుకట్టాలన్నాడు. ఇందుకు సంబంధిత డాక్టర్ తిరస్కరించేసరికి కోపం పట్టలేకపోయిన అతను తలను గోడకేసి బాదుకున్నాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.
ఇదీ జరిగింది..
లేఖ్ సింగ్ అనే ఈ పూజారి చేతి నుంచి శుక్రవారం ఉదయం లడ్డూ గోపాల్ విగ్రహం జారి పడిపోయింది. ఈ క్రమంలో ఆ విగ్రహం చెయ్యి విరిగింది. దీంతో వెంటనే ప్రతిమతో సహా అతను జిల్లా ఆసుపత్రికి వచ్చాడు. లడ్డూ గోపాల్ చేతికి చికిత్స చేయాలని డిమాండ్ చేశాడు. సంబంధిత డాక్టర్ అందుకు తిరస్కరించారు. దీంతో కోపం పట్టలేక గోడకేసి తలను బాదుకుని గాయపరచుకున్నాడు. మిగతా డాక్టర్లు వచ్చి నచ్చజెప్పినా అతను పట్టు విడవలేదు.
హిందూ మహాసభ సభ్యుల రాకతో..