తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కూలీ - పఠాన్‌కోట్‌ జిల్లాలో కూలీకి కోటి టాటరీ

పంజాబ్​కు చెందిన రోజువారీ కూలీకి అదృష్టం వరించింది. కోటి రూపాయల లాటరీ తగిలింది. లూధియానాలో న్యాయనిర్ణేతల సమక్షంలో జరిగిన డ్రాలో.. కూలీ కొన్న లాటరీ ఎంపికైంది.

1 crore lottery
కూలీ కుటుంబం

By

Published : Apr 18, 2021, 11:29 AM IST

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లా అఖోటా గ్రామానికి చెందిన రోజు కూలీ రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. వంద రూపాయలు పెట్టి కొన్న లాటరీ.. బోదరాజు అనే రోజు కూలీ జీవితాన్నే మార్చివేసింది.

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కూలీ

ఏప్రిల్‌ 14న బోదరాజు వంద రూపాయలు పెట్టి లాటరీ కొన్నాడు. లూధియానాలో న్యాయనిర్ణేతల సమక్షంలో జరిగిన డ్రాలో.. కోటి రూపాయల లాటరీ తగిలింది. ఈ విషయాన్ని అశోక్ బావా అనే లాటరీల నిర్వాహకుడు బోదరాజుకు చెప్పాడు. త్వరలోనే నగదు అందిస్తామని వెల్లడించాడు. ఈ ఆనందాన్ని భార్య, ఇద్దరు కూతుళ్లతో పంచుకున్న బోదరాజు.. వచ్చే డబ్బుతో పిల్లలిద్దరికీ మంచి చదువు చెప్పిస్తానని తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details