తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తెలంగాణ కొత్త మంత్రులు - వారికి కేటాయించిన శాఖలు ఇవే - తెలంగాణ మంత్రుల జాబితా 2023

Telangana New Cabinet Ministers Profiles : తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. నేడు ముఖ్యమంత్రిగా రేవంత్​ రెడ్డి సహా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్​ రెడ్డి వీరికి శాఖలు కేటాయించారు. ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించారంటే?

Telangana New Cabinet
Telangana New Cabinet Ministers Profiles

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 4:18 PM IST

Updated : Dec 7, 2023, 5:27 PM IST

Telangana New Cabinet Ministers Profiles : 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్​ పార్టీ దాదాపు దశాబ్ద కాలం పాటు అధికారం కోసం వేచి చూడాల్సి వచ్చింది. మార్పు రావాలంటే కాంగ్రెస్​ రావాలనే నినాదంతో ఈసారి ఎన్నికలకు వెళ్లి విజయాన్ని సాధించింది. పార్టీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్​ రెడ్డిని కాంగ్రెస్​ పార్టీ సీఎంగా ప్రకటించింది. దీంతో నేడు ఆయన ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్​తో పాటు 11 మంది అమాత్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మంత్రుల కూర్పులో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన వారికి అధిష్ఠానం పెద్ద పీఠ వేసింది. ఈ క్రమంలో భట్టి విక్రమార్క, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్​బాబు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​ రావు, సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్​ మొదలుగు వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు వీరి గురించి, వారికి కేటాయించిన శాఖల గురించి తెలుసుకుందాం.

తెలంగాణ నూతన మంత్రులు

11 మంది మంత్రులకు కేటాయించిన శాఖలివే:

  • మల్లు భట్టి విక్రమార్క - డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రిత్వ శాఖ
  • ఉత్తమ్​ కుమార్​ రెడ్డి - హోంశాఖ
  • కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి - పురపాలక శాఖ
  • జూపల్లి కృష్ణారావు - పౌరసరఫరాల శాఖ
  • దామోదర రాజనర్సింహ - ఆరోగ్య శాఖ
  • తుమ్మల నాగేశ్వర్​ రావు - రోడ్లు, భవనాల శాఖ
  • దుద్దిళ్ల శ్రీధర్​ బాబు - ఆర్థిక శాఖ
  • పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి - నీటి పారుదల శాఖ
  • దనసరి అనసూయ(సీతక్క) - గిరిజన సంక్షేమ శాఖ
  • కొండా సురేఖ - స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
  • పొన్నం ప్రభాకర్​ - బీసీ సంక్షేమ శాఖ

మల్లు భట్టి విక్రమార్క : (డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రిత్వ శాఖ)

  • మధిర నియోజకవర్గం
  • విద్యార్హతలు: ఎం.ఎ.
  • ఎమ్మెల్యే: 2009, 2014, 2019, 2023
  • ఎమ్మెల్సీ: 2007-2009
  • పదవులు: ప్రభుత్వ విప్, ఉపసభాపతి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎల్పీ నేత

ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి : (హోం మంత్రిత్వ శాఖ)

  • హుజూర్ నగర్ నియోజకవర్గం
  • విద్యార్హత : బీఎస్సీలో గ్రాడ్యుయేట్
  • భారత వైమానిక దళంలో మాజీ ఫైటర్ పైలట్
  • రాజకీయ అరంగేట్రం: 1994
  • ఎమ్మెల్యేగా : 1999, 2004, 2009, 2014, 2018, 2023
  • ఎంపీ: 2019 నల్గొండ
  • పదవులు: గృహ నిర్మాణశాఖ మంత్రి,
  • 2014లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు,
  • 2015 పీసీసీ అధ్యక్షుడు
  • కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడు

జూపల్లి కృష్ణారావు : (పౌర సరఫరాల శాఖ)

  • కొల్లాపూర్ నియోజకవర్గం
  • రాజకీయ అరంగేట్రం - 1999
  • ఎమ్మెల్యే: 2004, 2009, 2012, 2014
  • పదవులు: ఆహార, పౌర సరఫరాల శాఖ, దేవాదాయశాఖ, పంచాయితీ రాజ్ &గ్రామీణాభివృద్ధి శాఖ
  • 2011లో టీఆర్​ఎస్​లో చేరిక
  • 2023లో కాంగ్రెస్‌లో చేరిక

దామోదర రాజనర్సింహ : (ఆరోగ్య శాఖ)

  • ఆందోల్ నియోజకవర్గం
  • 1989లో రాజకీయ ఆరంగేట్రం
  • ఎమ్మెల్యే: 1999, 2004, 2009, 2023
  • పదవులు: ఉప ముఖ్యమంత్రి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్

దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు : (ఆర్థిక మంత్రిత్వ శాఖ)

  • మంథని నియోజకవర్గం
  • విద్యార్హత – పొలిటికల్ సైన్స్
  • రాజకీయ అరంగేట్రం - 1999
  • ఎమ్మెల్యేగా - 1999, 2004, 2009, 2018, 2023
  • మంత్రి పదవి: పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు
  • లీగల్ మెట్రాలజీ &శాసనసభ వ్యవహారాల మంత్రి

పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి : (నీటి పారుదల శాఖ)

  • పాలేరు నియోజకవర్గం
  • విద్యార్హతలు: దూరవిద్యలో డిగ్రీ, ఎల్.ఎల్.బి.
  • రాజకీయ అరంగేట్రం: 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్
  • 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
  • 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు
  • 2016లో టీఆర్​ఎస్​లో చేరిక
  • రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీల సభ్యుడు
  • 2023లో కాంగ్రెస్‌లో చేరిక
  • తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-ఛైర్మన్ గా నియామకం
  • 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి ఘనవిజయం

తుమ్మల నాగేశ్వర రావు : (రోడ్లు, భవనాల శాఖ)

  • ఖమ్మం నియోజకవర్గం
  • విద్యార్హత : డిగ్రీ
  • 1978లో రాజకీయ అరంగేట్రం
  • ఎమ్మెల్యే : 1985, 1994, 1999, 2009, 2014, 2023
  • అనుభవం: భారీనీటి పారుదల, చిన్ననీటి పారుదల శాఖ, రోడ్లు భవనాలు, మహిళా శిశు సంక్షేమం, ఆబ్కారీ శాఖ
  • 2014లో టీఆర్​ఎస్​లో చేరిక
  • 2015లో ఎమ్మెల్సీ

దనసరి అనసూయ (సీతక్క) : (గిరిజన సంక్షేమ శాఖ)

  • ములుగు నియోజకవర్గం
  • విద్యార్హతలు: పీహెచ్‌డీ, న్యాయవాది
  • 1996 వరకూ మావోయిస్టుగా అడవి జీవితం
  • రాజకీయ అరంగేట్రం: 2004లో తెదేపాలో చేరిక
  • ఎమ్మెల్యే: 2009, 2018, 2023
  • 2017లో కాంగ్రెస్‌లో చేరిక
  • ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

కొండా సురేఖ : (స్త్రీ, శిశు సంక్షేమ శాఖ)

  • నియోజకవర్గం వరంగల్ తూర్పు
  • విద్యార్హత: బీ.కాం
  • రాజకీయ అరంగేట్రం : 1995లో మండల పరిషత్ ప్రెసిడెంట్
  • ఎమ్మెల్యే: 1999, 2004, 2009, 2023
  • అనుభవం: మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి
  • 2014లో టీఆర్​ఎస్​లో చేరిక
  • 2018లో తిరిగి కాంగ్రెస్ గూటికి

పొన్నం ప్రభాకర్‌ : (బీసీ సంక్షేమ శాఖ)

  • హుస్నాబాద్‌ నియోజకవర్గం
  • విద్యార్హతలు : ఎంఏ, ఎల్‌ఎల్‌బీ
  • ఎంపీ: కరీంనగర్‌ 2009-14
  • అనుభవం: ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,
  • ఆంధ్రప్రదేశ్‌ మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి : (పురపాలక శాఖ)

నల్గొండ నియోజకవర్గం

విద్యార్హతలు : సివిల్​ ఇంజినీరింగ్​గా పట్టభద్రుడు

ఎంపీ : భువనగిరి 2019

ఎమ్మెల్యే : నాలుగుసార్లు 1999,2004, 2009, 2014

అనుభవం : ఎన్​ఎస్​యూఐ విద్యార్థి నాయకుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Last Updated : Dec 7, 2023, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details