తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Telangana Group 2 Exam Postponed : గ్రూప్-2 పరీక్ష వాయిదా.. జనవరి 6, 7న నిర్వహించాలని టీఎస్​పీఎస్సీ నిర్ణయం

Telangana Group 2
Telangana Group 2 Exam

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 9:16 PM IST

Updated : Oct 10, 2023, 10:41 PM IST

21:01 October 10

Telangana Group 2 Exam Postponed : గ్రూప్-2 పరీక్ష వాయిదా

నవంబరు 2, 3న జరగాల్సిన గ్రూప్-2 వాయిదా

Telangana Group 2 Exam Postponed :గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లుటీఎస్​పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్షల నిర్వహణకు సిబ్బంది కేటాయింపు కష్టమని టీఎస్​పీఎస్సీకి కలెక్టర్లు స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్-2ఉద్యోగాల కోసం 5 లక్షల 51 వేల 901 మంది దరఖాస్తు చేశారు. మొత్తం 1,600 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్ష నిర్వహణకు దాదాపు 25 వేల మంది పోలీసులు, 20 వేల మంది పరీక్ష సిబ్బంది కావాల్సి ఉంది. నవంబరు 3న ఎన్నికల నోటిఫికేషన్ రానున్నందున గ్రూప్-2 పరీక్ష నిర్వహణ సాధ్యం కాదని టీఎస్​పీఎస్సీ నిర్ణయించింది. అధికార యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో ఉంటుందని... అందువల్ల పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షను జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించాలని TSPSC ప్రాథమికంగా నిర్ణయించింది.

Telangana Group 2 Exam Postpone 2023 :రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో గ్రూపు-2 ఎగ్జామ్ నిర్వహణ ఏర్పాట్లపై టీఎస్​పీఎస్సీ కమిషన్‌ పలువురు జిల్లా అధికారులతో సోమవారం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఎలక్షన్స్​ కారణంగా పరీక్ష కోసం సిబ్బంది సర్దుబాటు కష్టమని కలెక్టర్లు కమిషన్​కు సూచించినట్లు తెలిసింది. రిటర్నింగ్‌, పరీక్ష చీఫ్‌ సూపరింటెండెంట్‌ అధికారుల నియామకం సాధ్యం కాదని వివరించారు. 2 రోజుల పాటు వరుసగా 4 సెషన్లలో పరీక్షల నిర్వహణకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతాయని వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కమిషన్‌ మరోసారి సమావేశమై.. పరీక్షల నిర్వహణపై స్పష్టత ఇచ్చింది.

Group2 Postpone Telangana Election 2023 : గ్రూప్​-2కు ఎన్నికల గండం.. డిసెంబర్​కు వాయిదా!.. ఫిబ్రవరిలో టీఆర్​టీ!!

Telangana TRT Exams 2023 : మరోవైపు టీఆర్‌టీ(Teachers Recruitment Test)లో భాగమైన ఎస్‌జీటీ (సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌) పరీక్షలు సైతం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ నిర్వహించేందుకు టీఎస్​పీఎస్సీ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబర్​ 20 నుంచి 24 వరకు స్కూల్‌ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీ పోస్టులకు, నవంబరు 25 నుంచి 30 వరకు ఎస్‌జీటీ(SGT) పరీక్షలు నిర్వహించాలి. నవంబర్​ 30న పోలింగ్​ నేపథ్యంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారని.. అందువల్ల టీఆర్​టీ(TRT) నిర్వహణపై దృష్టి పెట్టడం సాధ్యం కాకపోవచ్చునని విద్యా శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కనీసం ఎస్​జీటీ పరీక్షలను వాయిదా వేయక తప్పదని.. 20 నుంచి 24 వరకు ఉన్న పరీక్షలకు ఇబ్బంది లేకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ పరీక్షలు ఇప్పుడు వాయిదా పడితే.. మళ్లీ వచ్చే ఫిబ్రవరిలోనే నిర్వహిస్తారని విశ్వసనీయ సమాచారం.

Government Green Signal to Recruit Group1 Group2 Posts in AP: గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

Last Updated : Oct 10, 2023, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details