Avoid These Mistakes Applying for Telangana Dalit Bandhu : తెలంగాణ సర్కార్ దళితుల సమగ్ర అభివృద్ధి పేరుతో.. 'దళిత బంధు' అనే సంక్షేమ పథకం తెచ్చిన విషయం తెలిసిందే. 'దళితబంధు' స్కీమ్(Dalit Bandhu Scheme) కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. ఈ పథకం రాష్ట్రంలో దశల వారీగా అమలవుతోంది. ఇప్పటికే.. తొలి విడతలో రాష్ట్రంలో దాదాపు 35 వేల మందికి దళితబంధు లబ్ది చేకూరింది. రెండో విడత(Dalit Bandhu Scheme Second Phase) ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గానికీ ఈ దఫా 1100 మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. అయితే.. దళితబంధు పథకానికి అప్లై చేసుకునేటప్పుడు.. జనాలు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. దాంతో వారి అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి. ఇంతకీ ఈ స్కీమ్‌కి ఎవరెవరు అర్హులు? ఏయే పత్రాలు అవసరం? అప్లై చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు..? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దళితబంధు పథకానికి అర్హతలివే(Dalit Bandhu Scheme Eligibility) :
- ఈ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకునే వ్యక్తి దళితుడై ఉండాలి.
- దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు ఈ స్కీమ్‌కి అర్హులు.
- తెలంగాణలో శాశ్వత నివాసిగా గుర్తింపు పొంది ఉండాలి.
- ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకూ ఈ పథకం అమలవుతుంది.
- గతంలో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్నవారు కూడా ఈ స్కీమ్‌కు అర్హులు.
ఈ స్కీమ్‌కి దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలివే..
- ఆధార్ కార్డు
- ఓటర్ గుర్తింపు కార్డు
- రేషన్‌కార్డు
- కుల ధ్రువీకరణ పత్రం
- బ్యాంక్ అకౌంటు వివరాలు
- నివాస ధ్రువీకరణ పత్రం
- చెల్లుబాటు అయ్యే ఫోన్‌నంబర్
Dalit Bandhu 2nd Phase from October 2 : రెండో విడత దళితబంధు దరఖాస్తుల పరిశీలన షురూ..!
How to Apply for Dalit Bandhu in Telangana : అర్హతలు కలిగిన లబ్ధిదారులు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అందులో పేర్కొన్న అన్ని వివరాలు సక్రమంగా నమోదు చేయాలి. అలాగే పైన పేర్కొన్న పత్రాలను అప్లికేషన్‌కు జత చేయాలి. అయితే.. చాలా మంది దరఖాస్తు సమయంలో కొన్ని తప్పులు చేయడం ద్వారా వారు ఈ పథకంలో అందే లబ్దిని పొందలేక పోతున్నారు. అప్లికేషన్ సమయంలో చేయకూడని కొన్ని పొరపాట్లను ఇప్పుడు చూద్దాం..