TDP Chief Chandrababu to Meet KCR at Yashoda Hospital : హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో తుంటి ఎముకకు శస్త్ర చికిత్స చేయించుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కేసీఆర్ ఆరోగ్యం గురించి గవర్నర్ తమిళిసై(Tamilisi) వాకబు చేశారు. కేటీఆర్‌కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న కేసీఆర్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu) పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోకుంటున్నారని, ఆరు వారాల్లో సాధారణ జీవితం గడుపుతారని చంద్రబాబు ఆకాంక్షించారు.
వాకర్ సాయంతో కేసీఆర్ అడుగులు - ఆరోగ్యం కాస్త మెరుగుపడిందన్న వైద్యులు
"కేసీఆర్‌ను పరామర్శించడానికి వచ్చాను. డాక్టర్లతో కూడా మాట్లాడాను. ఆయన కోలుకోవడానికి ఒక ఆరు వారాలు సమయం పడుతుందని చెప్పారు. వారు చెప్పిన మాటలు విన్న తర్వాత తృప్తి కలిగింది. తొందరగా రికవరీ కావాలని, మళ్లీ ప్రజాసేవకు రావాలని కోరుకుంటున్నాను. ఒక్కోసారి జీవితంలో దురదృష్టకరమైన ఘటనలు జరుగుతాయి. వాటన్నింటిని దాటుకుని ముందుకు వెళ్లాలి."-చంద్రబాబు, టీడీపీ అధినేత
KCR Treatment at Yashoda Hospital :కేసీఆర్‌ను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యసేవలపైనా భట్టి ఆరా తీశారు. కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారని ఆయన తెలిపారు. మరోవైపు సినీ ప్రముఖులు చిరంజీవి, ప్రకాష్ రాజ్ తెలంగాణ మాజీ సీఎంను కలిసి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. కేసీఆర్‌ను బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ప్రముఖుల పరామర్శల దృష్ట్యా సోమాజీగూడ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి వాహనాల రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు.
మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన భట్టి విక్రమార్క మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన చిరంజీవి ఆదివారం యశోద ఆసుపత్రికి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను పలకరించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మంత్రి సీతక్క వెళ్లారు. ఆ తర్వాత తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుంతరావు వెళ్లి కేసీఆర్ ఆరోగ్యపై వాకబు చేశారు.
ఇదీ జరిగింది :తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఈనెల 7వ తేదీన రాత్రి కాలు జారి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్లోని సోమాజీగూడలో ఉన్న యశోద ఆసుపత్రికి తరలించారు. అనంతరం డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలో కేసీఆర్‌కు అనేక రకాల పరీక్షలు చేసి, ఎడమ కాలు తుంటి ఎముక విరిగిందని చెప్పారు. వెంటనే వైద్యులు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించి, 8వ తేదీ ఉదయం సీనియర్ వైద్యుల బృందం దాదాపు నాలుగు గంటలకు పైగా సర్జరీని నిర్వహించి విజయవంతం చేశారు. ఆయనకు ఆరు నుంచి 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.
కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరాను: రేవంత్ రెడ్డి
కేసీఆర్ తుంటి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం