విడాకులు అడిగిందని భార్యను నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపాడో వ్యక్తి. ఆ మహిళ చేతులు, మెడపై కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. ఈ ఘటన ముంబయిలోని చెంబూర్‌లో జరిగింది. మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అసలేం జరిగింది: ఇక్బాల్ ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి మొదట ఓ మహిళతో వివాహం జరిగింది. అయితే పిల్లలు పుట్టలేదన్న నెపంతో ఆమెను వదిలేసి రూపాలీ అనే మహిళను మూడేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. రూపాలీ వేరే మతానికి చెందిన మహిళ కావడం వల్ల ఇక్బాల్ కుటుంబ సభ్యులు రూపాలీని వేధించడం మొదలుపెట్టారు. ఆమెను ముస్లిం సంప్రదాయాలను పాటించమని ఇక్బాల్ కుటుంబసభ్యులు ఒత్తిడి చేశారు. బుర్ఖా వేసుకోమని అడగగా రూపాలీ అందుకు నిరాకరించింది. దీంతో తరచూ ఇంట్లో వాగ్వాదం జరుగుతుండేది. ఒత్తిడి తట్టుకోలేని రూపాలీ తన కొడుకుని తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. దాదార్‌లోని ఓ హాస్టల్లో తన స్నేహితురాలితో నివసిస్తోంది. భార్య భర్తలిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నప్పటికి ముస్లిం సంప్రదాయాలు పాటించే విషయమై ఇద్దరికి గొడవలు జరిగేవి. బాబు కస్టడీ విషయమై మాట్లాడాలని సోమవారం రూపాలీని బయటకు రమ్మని పిలిచాడు. బయటకి వచ్చిన రూపాలీని అతి దారుణంగా పొడిచాడు. గాయాలు తీవ్రంగా కావడం వల్ల రుపాలీ అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడి నుంచి పరారైన ఇక్బాల్‌కు కొన్ని గంటల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులు..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని టిట్రాన్ ప్రాంతంలో ఓ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. బాలుడి స్నేహితుల సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది:టిట్రాన్ ప్రాంతానికి చెందిన ఓ బాలుడు కొంత మంది స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఫాజిల్, బషర్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ బాలుడ్ని మభ్యపెట్టి చెరుకు తోటలోకి తీసుకెళ్లారు. ఎంత సేపటికి బాలుడు రాకపోవడాన్ని గమనించిన స్నేహితులు అతని ఆచూకీ కోసం గాలించారు. తీరా చెరుకు తోటలో గాలించగా అక్కడ బాలుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. బాలుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఫాజిల్, బషర్లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ప్రేయసిపై కోపంతో విషం తాగి ఆత్మహత్య :తన ప్రేయసిసామాజిక మాధ్యమాల్లో కొంతమంది పురుషులను ఫాలో అవుతోందని ఆగ్రహించిన యువకుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగింది. విషం తాగిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.