తెలంగాణ

telangana

By

Published : Aug 8, 2021, 9:00 PM IST

Updated : Aug 8, 2021, 10:13 PM IST

ETV Bharat / bharat

కంటెయినర్​ను ఆపి.. రూ.6 కోట్ల ఫోన్లు దోచేసి..

మొబైల్ లోడ్​తో వెళుతున్న కంటెయినర్​ను హైజాక్ చేసి అందులో ఉన్న రూ.6 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను దొంగిలించిన ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించింది. గుర్తు తెలియని దుండగులు సినీఫక్కీలో చేసిన ఈ చోరీని ఛేదించే పనిలో ఉన్నారు పోలీసులు.

tamilnadu
కంటెయినర్​ను ఆపి.. రూ.6 కోట్ల ఫోన్లు దోచేసి..

కంటెయినర్​ను ఆపి.. రూ.6 కోట్ల ఫోన్లు దోచేసిన దుండగులు..

కదులుతున్న కంటెయినర్​లో నుంచి దొంగతనాలు చేసే సన్నివేశాలు.. సినిమాల్లో చూస్తుంటాం. ఇదే తరహాలో.. తమిళనాడులో ఓ దొంగల ముఠా రెచ్చిపోయింది.

ఏం జరిగిందంటే..?

తమిళనాడులోని క్రిష్ణగిరిలో రూ.6 కోట్ల విలువైన మొబైల్​ ఫోన్లతో వెళ్తున్న ట్రక్కును అడ్డగించి నిమిషాల వ్యవధిలో వాటిని దోచుకెళ్లింది ఓ ముఠా. కాంచిపురంలోని ఓ మొబైల్స్‌ తయారీ ఫ్యాక్టరీ నుంచి సెల్‌ఫోన్లను, కర్ణాటకలోని కోలార్‌కు తరలిస్తుండగా ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ట్రక్కు హోసూర్‌ నుంచి కర్ణాటక సరిహద్దులోని దేవరాయ సముద్రానికి దగ్గర్లో ఉండగా గుర్తుతెలియని దొంగల ముఠా వాహనాన్ని అడ్డగించినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కులోని డ్రైవర్‌, అతడి సహాయకుడిపై దాడి చేసి రూ.6కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. రహదారిపై ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

కంటెయినర్ దొంగతనం జరిగిన ప్రాంతం
కంటెయినర్ లోపలి దృశ్యాలు

గతంలోనూ..

గతేడాది అక్టోబర్‌లో రూ.15 కోట్ల విలువైన సెల్​ఫోన్లను ఇదే తరహాలో దోచుకోగా.. ఆ కేసులో నిందితులైన 10 మందిని మధ్యప్రదేశ్, ఉత్తర్​ప్రదేశ్​ల్లో హోసూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇదే ముఠా ఆంధ్రప్రదేశ్​లోనూ కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను దోచుకుందని పోలీసులు తెలిపారు.

కంటెయినర్ దొంగతనం జరిగిన ప్రాంతంలో గుమిగూడిన జనం

తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో ఈ తరహా దొంగతనాలు పెరుగుతున్నందున.. ఇరు రాష్ట్రాల పోలీసులు సెల్​ఫోన్ దోపిడీ ముఠాను గుర్తించే పనిలో పడ్డారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 8, 2021, 10:13 PM IST

ABOUT THE AUTHOR

...view details