తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై 6 వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదానికి గురైన వాహనాల్లో రెండు ప్రైవేటు బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఉన్నాయి. మంగళవారం ఉయదం కడలూరు జిల్లా వెప్పూరు వద్ద జరిగిన ఈ ప్రమాదం జరిగింది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరు వాహనాలు ఢీ.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
ప్రమాదం ఇలా జరిగింది...
చెన్నై సమీపంలోని నంగనల్లూర్కు చెందిన విజయరాగవన్ కారులో చైన్నైకి వెళ్తున్నాడు. అతడితో పాటు అతడి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు కూడా కారులోనే ఉన్నారు. ఇయ్యనార్పాలాయం వద్ద ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుండడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో విజయ రాఘవన్ కారును ఆపాడు ఈ క్రమంలో వేగంగా వస్తున్న లారీ ఆగివున్న రాఘవన్ కారును వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం ఆ కారు ముందున్న మరో కారును ఢీకొట్టింది. అలా ముందున్న మరో లారీ మధ్యలో కారు నుజ్జునుజ్జైంది. దీంతో ఆ కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. వెప్పూర్ అగ్నిమాపక దళ సిబ్బంది సహాయంతో మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ పారిపోయాడు. అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.