తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇంటికి వెళ్లాలి.. హెలికాఫ్టర్ ల్యాండింగ్​కు​ పర్మిషన్ ఇవ్వండి'​.. బొమ్మ చాపర్​తో రైతు వినూత్న నిరసన!

తమిళనాడులో ఓ వింత ఘటన జరిగింది. తమ ఇంటిపై హెలికాప్టర్​ ల్యాండ్​ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ రైతు తన కుటుంబసభ్యులతో కలిసి కలెక్టరేట్​ ఎదుట నిరసనకు దిగాడు. ఇంతకీ వీరెందుకు ఇలా అడిగారంటే..

tamilnadu farmer protest for helicopter
tamilnadu farmer protest for helicopter

By

Published : Dec 13, 2022, 11:03 AM IST

తమ ఇంటిపై హెలికాప్టర్​ ల్యాండ్​ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ రైతు తన కుటుంబసభ్యులతో కలిసి కలెక్టరేట్​ ఎదుట నిరసనకు దిగాడు. తమ గోడును ఎంతో మంది అధికారులకు చెప్పుకున్నా వారు వినిపించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా చేతిలో బొమ్మ హెలికాప్టర్​ పెట్టుకుని వినూత్నంగా ధర్నాకు దిగారు కుటుంబ సభ్యులు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడులోని ధర్మపురికి చెందిన గణేశన్​ అనే రైతు కుటుంబాన్ని ఆ గ్రామస్థులు గత కొంత కాలంగా వేధిస్తున్నారు. వారి ఇంటికి కూడా వెళ్లనివ్వకుండా చుట్టూ గొడలు కట్టి అడ్డుకుంటున్నారు. నాలుగు నెలలుగా వారందరూ ఓ బంధువు ఇంట్లోనే నివసిస్తున్నారు. ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించినా తమ ఇంటి చుట్టూ ప్రహరీ గోడలు కట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై పోలీసులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. గత్యంతరం లేక ఇంటికి హెలికాప్టర్​లోనే వెళ్లడమే సరైన మార్గమని నిర్ణయించుకున్నారు గణేశన్​. అలా సోమవారం బొమ్మ హెలికాప్టర్​తో పాటు వినతి పత్రాన్ని చేత పట్టుకుని కలెక్టరేట్​ ఎదురుగా బైఠాయించారు. తమ ఇంటిపై హెలికాప్టర్​ ల్యాండ్​ అయ్యేలా చూడండి అంటూ నిరసనలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details