ప్రపంచ పర్యటక కేంద్రం ఆగ్రాలోని తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు కాల్ బూటకమని అని తేలింది. కంట్రోల్ రూమ్‌కు అందిన సమాచారం ఆధారంగా పోలీసులు తాజ్‌మహల్‌కు చేరుకుని తనిఖీలు చేపట్టారు. పర్యటకులను బయటకు పంపి బాంబు, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృత తనిఖీలు చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. దీంతో బాంబు బెదిరింపు కాల్ ఆకతాయిల పనిగా నిర్ధరించారు.
"బాంబ స్క్వాడ్ సహా ఇతర బృందాలు తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఎలాంటి అనుమానించ దగ్గ వస్తువులు దొరకలేదు. బాంబు సమాచారం ఇచ్చిన వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటాం. 99% ఇది తప్పుడు సమాచారమే." అని చెప్పారు ఆగ్రా ఐజీ సతీశ్ గణేశ్.