తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బేరియాట్రిక్​ సర్జరీతో బరువు తగ్గిన శునకం

'డాగ్​ లవర్స్'​ తమ పెంపుడు శునకాలను కుటుంబ సభ్యుల్లో ఒకటిగా భావిస్తారు. దానికేమైనా అయితే.. వారూ కలత చెందుతారు. పుణెలో ఇలాంటి ఓ 'డాగ్​ లవర్'​ తన శునకం అధిక బరువుతో బాధ పడుతుంటే చూడలేకపోయారు. దానికి బేరియాట్రిక్​ సర్జరీ చేయించి, బరువు తగ్గేలా చేశారు.

bariatric surgery on dog
కుక్కకు బేరియాట్రిక్​ ఆపరేషన్​

By

Published : Jun 18, 2021, 10:15 AM IST

అధిక బరువుతో ఇబ్బంది పడుతూ బేరియాట్రిక్​ సర్జరీ చేయించుకున్న వారి గురించి వినే ఉంటారు. అయితే తాజాగా ఓ శునకానికి ఆ తరహా ఆపరేషన్​ చేయటం విశేషం. పుణెకు చెందిన యాస్మిన్​ దారువాలా ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. ఆమె దానికి దీపిక అనే పేరు పెట్టుకున్నారు. దీపిక బరువు పెరిగి 50 కిలోలకు చేరుకోగా.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండేది.

అధిక బరువుతో ఉన్న శునకం
శునకానికి బేరియాట్రిక్​ సర్జరీ చేస్తున్న వైద్యులు
'దీపిక'కు శస్త్రచికిత్స

జంతువైద్య నిపుణుడు డాక్టర్​ నరేంద్ర పరదేశీ ఆ శునకాన్ని పరిశీలించి శస్త్రచికిత్స చేయాలని సూచించారు. దానివల్ల శునకం బరువు తగ్గి సమస్య తొలగుతుందని చెప్పారు. ఆపరేషన్​ తర్వాత దీపిక 5 కిలోల బరువు తగ్గింది. శునకానికి బరువును తగ్గించే సర్జరీ చేయటం.. దేశంలో ఇదే తొలిసారని ఆయన తెలిపారు.

జంతువైద్య నిపుణుడు డాక్టర్​ నరేంద్ర పరదేశీ

ABOUT THE AUTHOR

...view details