Supreme Court on disabled employees: దివ్యాంగులను ఉద్యోగం నుంచి తొలగించే ముందు... వారికి తగ్గ ప్రత్యామ్నాయ పోస్టలు ఏమైనా ఉన్నాయా అన్నది పరిశీలించాలని, వారికి సహేతుక వసతి కల్పించడం పవిత్రమైనదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు గుజరాత్ హైకోర్టు డివిజన్ బెంచ్ 2010లో ఇచ్చిన ఓ కేసు తీర్పును రద్దు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌ల ధర్మాసనం శుక్రవారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
Supreme court identify disability
సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రవీందర్ కుమార్ ధరివాల్...'కాల్చి పారేస్తా. లేదంటే నేనే కాల్చుకుని చస్తా' అని బెదిరించారు. అంతర్గత విచారణ సందర్భంగా... తన మానసిక ఆరోగ్యం బాగాలేదని ధరివాల్ వెల్లడించి, అందుకు రుజువుగా కొన్ని ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు. అయినప్పటికీ, అతనిపై విచారణ కొనసాగించాలని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేయగా, ధరివాల్ సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ డి.వై.చంద్రచూడ్ 9 పేజీల తీర్పును వెలువరించారు.
"సీఆర్‌పీఎఫ్ ఉద్యోగిపై విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేందుకు ధరివాల్ అసమర్థుడని భావిస్తే అతనికి వికలాంగుల హక్కుల చట్టం-2016 వర్తిస్తుంది. ముందుగా అతడిని ప్రత్యామ్నాయ పోస్టుకు బదిలీ చేసి, వేతన భత్యాలకు రక్షణ కల్పించాలి. పిటిషనర్‌కూ, ఇతరులకూ హాని కలిగించని పోస్టుకు బదిలీచేయాలి. పరిహారం సమకూర్చాలి. అలాగని యజమానిపై అసమాన్య భారం మోపకూడదు" అని ధర్మాసనం పేర్కొంది.