తెలంగాణ

telangana

By

Published : Sep 14, 2021, 7:26 AM IST

ETV Bharat / bharat

Supreme Court: 'కారుణ్య నియామకాలకు వారే అర్హులు'

అవివాహిత లేదా వితంతువైన కుమార్తెకే కారుణ్య నియామకం కింద ఉద్యోగం చేసే హక్కు వర్తిస్తుందని సుప్రీంకోర్టు (Supreme Court of India) పేర్కొంది. ఈ మేరకు కర్ణాటక చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం స్పష్టతనిచ్చింది.

supreme court
supreme court

అవివాహిత లేదా వితంతు కుమార్తెకు మాత్రమే తమ తల్లి, లేదా తండ్రికి చెందిన కారుణ్య నియామకం వర్తిస్తుందని కర్ణాటకకు చెందిన ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court of India) స్పష్టీకరించింది. ఉద్యోగి చనిపోయే నాటికి అలాంటి వారు ఆ ఉద్యోగితో కలిసి నివాసం ఉంటున్నప్పుడే వారిని 'ఆధారపడినవారు'గా పరిగణిస్తామని, నియామక అర్హత వారికే ఉంటుందని తేల్చిచెప్పింది.

'కర్ణాటక సివిల్‌ సర్వీసు (కారుణ్య నియామకాలు) నిబంధనలు- 1996'పై సమీక్ష సందర్భంగా జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఉద్యోగిగా ఉన్న తల్లి చనిపోయిన తేదీ తర్వాత కుమార్తె విడాకులు తీసుకుని, కారుణ్య నియామకానికి అర్హత పొందాలని ప్రయత్నించడాన్ని తప్పుపట్టింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details