తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అలా ఎలా నా మరణవార్తను ప్రకటిస్తారు'

లోస్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ (78) మృతిచెందినట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. అసత్య వార్తలను నమ్మొద్దని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ఆడియో టేప్‌ విడుదల చేశారు. తాను మరణించానో లేదో ధ్రువీకరించుకోకుండా ప్రకటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు.

By

Published : Apr 23, 2021, 10:53 PM IST

sumitra mahajan
సుమిత్రా మహాజన్

లోస్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ మృతిచెందినట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. అసత్య వార్తలను నమ్మొద్దని పేర్కొన్న సుమిత్రా మహాజన్‌ (78) ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ఆడియో టేప్‌ విడుదల చేశారు. సుమిత్రా మహాజన్‌ మృతిచెందారని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ సంతాపం ప్రకటిస్తూ గురువారం ట్వీట్‌ చేశారు. కొన్ని మీడియా సంస్థలు సైతం ఇదే వార్తను తప్పుగా ప్రచారం చేశాయి. భాజపా నేతల విమర్శల అనంతరం శశిథరూర్‌ సహా పలువురు తమ ట్వీట్లను తొలగించారు. తాను మరణించానో లేదో ధ్రువీకరించుకోకుండా ప్రకటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన మహాజన్‌.. కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభ స్పీకర్‌ ఈ అంశాన్ని పరిశీలించాలని కోరారు.

సుమిత్రా మహాజన్‌ ఆరోగ్యంగా ఉన్నారన్న వార్త సంతోషం కలిగించిందన్న శశిథరూర్‌ విశ్వసనీయ సమాచారం మేరకే ఆమె మరణ వార్తపై ట్వీట్‌ చేసినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌ ఇండోర్ లోక్‌సభ స్థానం నుంచి ఎనిమిది సార్లు గెలిచిన సుమిత్రా మహాజన్‌.. 2014 నుంచి 2019 వరకు లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు.

ఇదీ చదవండి :కరోనాతో నమ్మకం కోల్పోవద్దు: బోబ్డే

ABOUT THE AUTHOR

...view details