Students Build Tree House: కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు తప్పనిసరి అయ్యాయి. అయితే నెట్వర్క్ సమస్యతో గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది విద్యార్థులు డిజిటల్ తరగతులకు దూరమవుతున్నారు. కానీ జమ్ముకశ్మీర్‌లోని మాంతా గ్రామానికి చెందిన విద్యార్థులు.. సిగ్నల్ సమస్యలను నిందించకుండా వినూత్నంగా ఆలోచించారు.
సిగ్నల్ కోసం చెట్టుపైనే ఇంటిని నిర్మించారు. ఇప్పుడు గ్రామంలోని విద్యార్థులంతా ఈ ట్రీ హౌస్‌లో ప్రశాంతంగా చదువుకుంటున్నారు.
సత్యేశ్వర్సింగ్ అనే ఓ కళాకారుడు వీరికి సహకారం అందించారు. ఈ ఇంటి నిర్మాణానికి వెదురు బొంగులను వినియోగించారు. ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకునేలా ట్రీహౌస్ను నిర్మించినట్లు సత్యేశ్వర్ తెలిపారు.
"గ్రామంలో కొన్ని ప్రాంతాల్లోనే ఇంటర్నెట్ బాగా వస్తోంది. వాటిల్లో ఈ ప్రాంతం ఒకటి. పిల్లలు వారి సమస్యలను చెప్పడం వల్ల ఇ ఇంటిని నిర్మించాలన్న ఆలోచన వచ్చింది."