ఉత్తరప్రదేశ్‌కు చెందిన హరిలాల్ సక్సేనా అనే వలస కూలీ పదేళ్ల కిందటే.. ఉపాధి కోసం ఒడిశాకు వచ్చాడు. గంజాం జిల్లాలోని కిర్తిపూర్ గ్రామంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. హరిలాల్..40ఏళ్లగా రోజూ ఒక పిడికెడు ఇసుక తింటున్నాడు. యూపీలోని అరంగాపూర్‌లో పుట్టిన ఈయనకి చిన్నప్పటినుంచే ఇసుక తినడం అలవాటుగా మారింది. ఇతరులు తమకిష్టమైన ఆహార పదార్థాలతో భోజనం చేస్తే ఎంత తృప్తి పడతారో తనకు ఇసుకు తింటున్నప్పడూ అంతే సంతోషం కలుగుతుందని హరిలాల్ చెబుతున్నాడు.
'ఇసుక ప్రియుడు'.. 40 ఏళ్లుగా అదే ఆహారం!
Man eating sand: ఒక్కొక్కరు ఒక్కో ఆహార పదార్థాన్ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. భోజన ప్రియులైతే మరికొంత ఎక్కువగానే తింటారు. కానీ.. ఒడిశాకి చెందిన ఓ వలస కూలీ దేన్ని ఇష్టంగా తింటాడో తెలిస్తే మీరు అశ్చర్యపోతారు. ఇంతకీ అతను ఏం తింటున్నాడో తెలుసుకుందాం.
భోజనం చేసిన తర్వాత లేదా భోజనానికి ముందు ఇసుక తినడం అలవాటుగా మారిందని హరిలాల్ చెబుతున్నాడు. తమ గ్రామానికి దగ్గర్లోనే నది ఉండడం వల్ల రోజూ ఆ నది ఒడ్డుకు వెళ్లి ఇసుక తినేవాడిని అంటున్నాడు. వర్షాకాలం వస్తే ముందుగానే ఇసుక బస్తాలను సేకరించి ఇంట్లో నిల్వ ఉంచుకునేవాడు. అంతలా ఇసుక ప్రియుడిగా మారిపోయాడు. ఒకప్పడు విపరీతంగా తినేవాడినని ఇప్పడు కాస్త తగ్గిందని చెబుతున్నాడు. ఇసుక తిన్న తర్వాత కొంచెం అసౌకర్యంగా ఉంటుంది కానీ.. ఇప్పటి వరకు ఎలాంటి ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోలేదని హరిలాల్ తెలిపాడు. ప్రస్తుతం ఒడిశాలో నివాసముంటున్న ఇతడ్ని మొదటిసారి ఇసుక తినడం చూసి ఆశ్చర్యపోయామని తోటి కార్మికులు, స్థానికులు వివరించారు. తింటే ప్రమాదమని చెబుతున్నా హరిలాల్ ఇసుక తినడం మాత్రం ఆపేవాడు కాదని తెలిపారు.
ఇదీ చదవండి:మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు.. రూ.2.82 కోట్ల నగదు,1.80 కిలోల బంగారం స్వాధీనం