Central Government Jobs : ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ (జేఈ) ఉద్యోగాల భార్తీకి సంబంధించి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ). మొత్తం 1324 ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఈనెల 26 నుంచి స్వీకరిస్తోంది. ఆసక్తి కలిగి, అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు..
SSC JE Total Posts 2023 : 1324 పోస్టులు.
పోస్టు..
SSC JE Posts : గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్ పోస్టులు.
విద్యార్హతలు..
SSC JE Education Qualification : డిప్లొమా (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) చదివినవారు అర్హులు. కొన్ని పోస్టులకు పని అనుభవం కూడా తప్పనిసరిగా చేర్చారు.
జీతం:
SSC JE Posts Salary : ఏడో వేతన స్కేలు ప్రకారం రూ.35,400-రూ.1,12,400 వరకు జీతభత్యాలు ఉంటాయి.
వయో పరిమితి:
SSC JE Age Limit : పోస్టులను బట్టి కొన్ని పోస్టులకు 30 ఏళ్లు, మరికొన్నింటికి 32 ఏళ్లు వయో పరిమితిని విధించారు. వివిధ కేటగిరీలవారికి వయోపరిమితుల్లో సడలింపులు ఉన్నాయి. కొన్ని కేటగిరీలవారికి మినహాయింపులు కూడా ఉన్నాయి.
అప్లికేషన్ ఫీజు:
- SSC JE Application Fee : దరఖాస్తు రుసుము- రూ.100/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. పూర్తిగా ఉచితం.